ఆంధ్రప్రదేశ్‌

కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాలకు ఆనుకుని అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని... దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతాన్ని ఆనుకుని అల్పపీడనం, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో గడిచిన 24 గంటల్లో పశ్చిమగోదావరి జిల్లా వెలర్పాడులో గరిష్ఠంగా 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది.