రంగారెడ్డి

సమస్యల పరిష్కారానికే వికారాబాద్‌లో ప్రజావాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజావాణికి చక్కని స్పందన జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వెల్లడి
వికారాబాద్, డిసెంబర్ 21: రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణిని వికారాబాద్‌లో ఏర్పాటు చేశామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. సోమవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వికారాబాద్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ప్రజావాణికి చక్కని స్పందన వచ్చిందని చెప్పారు. ప్రజల నుంచి దాదాపు 170 అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. అర్జీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. జిల్లాలో భౌగోళిక పరిస్థితులతో గ్రామీణ ప్రాంత ప్రజలు కలెక్టరేట్‌కు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రాంతాలవారే ఎక్కువగా ప్రజావాణికి వస్తున్నారని, గ్రామీణ ప్రజల సౌకర్యార్థం వికారాబాద్‌లో నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజావాణిలో ఎక్కువగా పింఛన్లు, పాసుపుస్తకాలపైనే అర్జీలు వచ్చాయని, వాటి పరిష్కారానికి డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరక్టర్‌కు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు. వికారాబాద్‌లో ప్రజావాణిని తరచుగా నిర్వహించే ప్రయత్నం చేస్తామని విలేఖరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితుల కారణంగా నీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీకుంటున్నామని తెలిపారు. నీటి వనరులను అద్దెకు తీసుకోవడం, నీటి రవాణ, బోర్లను మరమ్మతు, ఫ్లషింగ్ చేయించడం చివరి ప్రాధాన్యతగా, తప్పనిసరి పరిస్థితుల్లో బోర్లు వేయిస్తామని పేర్కొన్నారు. నీటి సమస్య నివారణకు సమగ్ర ప్రణాళికను రూపొందించామని, క్షేత్రస్థాయిలో మండల ప్రత్యేకాధికారులు ఎప్పటికపుడు సమీక్షిస్తూ వివరాలను జిల్లా యంత్రాంగానికి అందిస్తారని అన్నారు. ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి కాట, వికారాబాద్ సబ్‌కలెక్టర్ శృతి ఓజా, జిల్లా పరిషత్ సిఇవో రమణారెడ్డి, డిఆర్‌డిఎ పిడి సర్వేశ్వర్‌రెడ్డి, ఇన్‌చార్జి డిపివో పద్మజ పాల్గొన్నారు.