నల్గొండ

కృష్ణ పుష్కరఘాట్ కోసం కలెక్టర్‌కు వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ , డిసెంబర్ 11: నల్లగొండ పరిధిలోని పానగల్ వద్ద గల చాయా సోమేశ్వర ఆలయం వద్ద కృష్ణాపుష్కరఘాట్‌ను ఏర్పాటుచేయాలని ఆలయ చైర్మన్ జి.అనంతరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016ఆగస్టులో వచ్చే కృష్ణాపుష్కరాలను పురస్కరించుకోని చాయా సోమవేశ్వర దేవస్థానం పానగల్ వద్ద సుమారు 4ఎకరాల్లో విస్తరించి ఉన్న కోనేరులో కృష్ణపుష్కరఘాట్‌ను ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. ఈ పుష్కరఘాట్‌ను అభివృద్దిపరిచినట్లయితే బతుకమ్మ, కార్తిక వనభోజనాలు, శివరాత్రి, తొలి ఏకాదశి లాంటి అన్ని సాంప్రదాయ పండుగలు నిర్విఘ్నంగా నిర్వహించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. దురదృష్టవశాత్తు చారిత్రిక, శాస్తస్రాంకేతిక శిల్పాల నైపుణ్యంతో నిర్మితమై ఈ దేవాలయం చాలా దశాబ్ధాలుగా నిరాధారనకు గురవుతునందని, ఇటీవల దేవాలయ పాలకమండలి, పురాతన దేవాలయా సేవాసమితి సహకారంతో ఎన్నో అభివృద్ది పనులను స్వచ్చందంగా చేపట్టడం జరిగిందన్నారు. కృష్ణాపుష్కరాలకు నల్లగొండవాసులు దూరం వెళ్లకుండా పట్టణంలోని కోనేరును ఎంపిక చేయడం వలన వృద్ధులకు, స్ర్తిలకు ఎంతో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కొలను లోకి ఉదయసముద్రం నుండి నిరంతరం నీటి ప్రవాహం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు మేసరి రత్నం, కొడకల రేణుక, 11వ వార్డు కౌన్సిలర్ పచ్చళ్ల హారికఅశోక్, ధరనికోట రవీందర్, వెంకటేశ్వర్లు, రవి, హరిబాబు, మధుకర్‌రెడ్డి, శివ, ఈఓ సులోచన, సోమశేఖర్, వెంకట్, యాదయ్య, పూజారులు విజయ్‌కుమార్, అజయ్‌కుమార్‌లు ఉన్నారు.