అంతర్జాతీయం

సార్క్ దేశాలకు ఉమ్మడి కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీమాంతర ఉగ్రవాద కేసుల సమర్థ విచారణకు అవసరం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి శరద్ బోబ్‌డే సూచన
ఐక్యరాజ్య సమితి, మార్చి 11: ముంబయి నగరంపై 2008లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ప్రస్తావిస్తూ, ఇలాంటి సీమాంతర ఉగ్రవాద దాడి కేసులను సమర్థవంతంగా విచారించడానికి దక్షిణాసియాలోని దేశాల కోసం ఒక ఉమ్మడి కోర్టును ఏర్పాటు చేయాలని భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి శరద్ బోబ్‌డే సూచించారు. ఈ ఉమ్మడి కోర్టులో దక్షిణాసియాకు చెందిన ప్రతి దేశం నుంచి న్యాయమూర్తులు ఉండాలని, దీనివల్ల ఆ న్యాయమూర్తులు తమ విజ్ఞానాన్ని పంచుకోగలుగుతారని, సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా విచారించగలుగుతారని ఆయన వివరించారు. గురువారం ఇక్కడ ఐరాస భద్రతా మండలి కౌంటర్-టెర్రరిజం కమిటీలో ‘అప్‌హోల్డింగ్ జస్టిస్: ద ఎఫెక్టివ్ అడ్‌జుడికేషన్ ఆఫ్ టెర్రరిజం కేసెస్’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో జస్టిస్ శరద్ బోబ్‌డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లో దాడికి పాల్పడిన ఘటనల్లో 26/11 (ముంబయి నగరంపై) దాడి ఒకటి. ఉగ్రవాదులు ముంబయిలోకి చొరబడి వారు ఏం చేయాలనుకున్నారో అది చేశారు. సరిహద్దుల ఆవల ఉన్న సూత్రధారులు ఈ దాడులకు మార్గదర్శనం చేశారు’ అని పేర్కొన్నారు. ‘ఇది ఉగ్రవాదులకు ఉండిన అనుకూలత. భారత ప్రజలకు ఉండిన ప్రతికూలత. ఉగ్రవాదుల ప్రణాళిక ఏంటో వారికి తెలియదు. ఉగ్రవాదులు తరువాత ఎక్కడికి వెళతారో వారికి తెలియదు’ అని ఆయన ఆనాటి దాడి గురించి వివరించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో న్యాయ వ్యవస్థ ఎలా సహాయపడుతుందనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో న్యాయ వ్యవస్థ చేయగల సహాయం గురించి వివరించారు. ఆయా దేశాల్లో ఉగ్రవాదుల కేసులను ఎలా ఎదుర్కోవడం అనే అంశంపై చర్చించేందుకు ఐరాస మొట్టమొదటిసారి ప్రపంచంలోని ఆయా దేశాల సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించింది. సార్క్ దేశాలకు ఉమ్మడి కోర్టు ఉండటం, అందులో అన్ని సార్క్ దేశాల న్యాయమూర్తులు ఉండటం వల్ల సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి దోహదపడుతుందని జస్టిస్ బోబ్‌డే వివరించారు.