రాష్ట్రీయం

జయంతిపురంలో ఫెర్టిలైజర్స్ కంపెనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 30: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని జయంతిపురం గ్రామంలో సర్వే నెంబర్.93లో యూరియా ప్లాంట్‌ను నెలకొల్పేందుకు విబిసి ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు జరగ్గా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత జూలై 15న జీవోఎంఎస్ నెం.269 ద్వారా ఆ భూముల కేటాయంపునకు సంబంధించి తదుపరి చర్యలకు కృష్ణా జిల్లా కలెక్టర్, సిసిఎల్‌ఎలను ఆదేశించటం జరిగిందని పరిశ్రమల శాఖ తరపున సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సోమవారం ఇక్కడ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. అయితే ఈ భూముల కేటాయంపులపై ప్రభుత్వంపై నిందలు మోపుతూ వస్తున్న వార్తాకథనాల్లో వాస్తవాలు లేవని పేర్కొన్నారు. మొదటి నుంచి జగ్గయ్యపేట ప్రాంతంలో వున్న సున్నపురాయి నిక్షేపాల వల్ల నెలకొల్పిన సిమెంట్ ఫ్యాక్టరీలు మినహా కొత్త పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. విబిసి ఫర్టిలైజర్స్ కంపెనీ 2 మిలియన్ టన్నుల అమ్మోనియా, యూరియా తయారీ ప్లాంట్‌ను రూ.7,578 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పుతామని, 2,700 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని 2007లో దరఖాస్తు చేసుకుని అదే ఏడాది డిసెంబర్‌లో అనుమతి పొందినదన్నారు. ఈమేరకు కలెక్టర్ 2010, ఏప్రిల్ 29న 430.90 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు సిసిఎల్‌ఎకు ప్రతిపాదనలు పంపి తిరిగి జూన్ 28న 498.93 ఎకరాలకు సవరించారన్నారు. 2012లో రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదిరిందని తెలిపారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 2012 జూన్ 27న ఈ ప్రతిపాదనలను ఆమోదించిందన్నారు. 500 ఎకరాల భూమిని విబిసి - విశాఖ బాట్లింగ్ కంపెనీకి కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్స్ చేసిందన్నారు. పైగా ఉత్పత్తి ప్రారంభం నుంచి 50 శాతం మేర వ్యాట్, సిఎస్‌టిలలో ఐదేళ్ల పాటు రాయితీ కల్పించిందని పేర్కొన్నారు.