యువ

విజయానికి 'మూడు' మెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో ఉన్న ఉద్యోగాలు వేరు. నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాలు వేరు. దాదాపు అన్ని ఆదునిక వృత్తులకూ ఈ విశే్లషణా సామర్థ్యం అత్యంత ముఖ్యం. అంటే వివేచన, విచక్షణతో కూడిన ప్రతిభ నేటి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికీ ఎంతో అవసరమన్నమాట. అంటే ఏ ప్రాజెక్టును చేపట్టినా..లేదా ఓ కీలక బాధ్యతను నిర్వర్తించాలన్నా..అందుకు అవసరమైన వౌలిక వివరాలను సేకరించడంతో పాటు వాస్తవానుగుణంగా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాలి. ఇందుకు కేవలం అరకొర పరిజ్ఞానం, అవగాహన సరిపోదు. విషయం లోతుల్లోకి వెళితే తప్ప..అందుకు అవసరమైన విశే్లషణా పటిమను, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎలాంటి సమస్యమైనా అధిగమించే లేదా ఎలాంటి అవరోధం తలెత్తకుండా ముందుగానే ఊహించి, విశే్లషించడం అన్నది ఆధునిక వృత్తుల్లో రాణించడానికి అత్యవసరం. ఈ సామర్థ్యం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికే కాదు..చిన్న చిన్న ఉద్యోగాలు కోరుకునే వారికీ ఎంతో అవసరం. ఎందుకంటే..ఈ రకమైన విశే్లషణా పటిమతోనే మనం చేసే పనిపట్ల లోతైన అవగాహన ఏర్పడుతుంది.
-=========-
ఇది పోటీ ప్రపంచం. అనుకున్న ఉద్యోగం రాకపోతే ఎనలేని నిరాశ. ఇక మనం ఏ ఉద్యోగానికీ పనికిరామేమోనన్న ఆందోళన. పట్టా తీసుకుని జాబ్ మార్కెట్‌లో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ కోటి ఆశలుంటాయి. వర్తమానాన్ని ఆలంబనగా చేసుకుని భవిష్యత్ కెరీర్ సౌధాలు నిర్మించుకోవాలన్న తపన ఉంటుంది. మరి ఆశకు వాస్తవానికీ లంగరు అందేదెలా అన్నదే ప్రశ్న. కోరికలే గుర్రాలైతే అన్న సామెత ఇలాంటి పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చిదేమోననిపిస్తుంది. ఎందుకంటే లక్ష్యం ప్రతిభతో ముడివడి ఉండాలి. అంటే మన అర్హతల్ని బట్టే ఉద్యోగం ఉంటుంది..వస్తుంది కూడా! అలాంటప్పుడు అర్హతతో, ప్రతిభతో, సమర్థతతో సంబంధం లేకుండా అందని ‘చందమామ’ను ఆశించి అది దక్కక పోతే నిరాశ చెందడంలో అర్థం లేదు. అందుకే వర్తమాన ప్రపంచం విసురుతున్న సవాళ్లను అందిపుచ్చుకునేలా..వాటికి ఎదురీది మరీ విజయాన్ని సాధించేలా మన సామర్ధ్యానికి పదును పెట్టుకోవాలి. అదపు చూసి అవకాశాల రాజ్యాన్ని ఏలాలి! ఇప్పుడున్న ఉద్యోగాలన్నీ కూడా కేవలం అరకొర ప్రతిభ ఆధారంగా లభించేవి ఏమీ కాదు. కేవలం డిగ్రీ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరూ మనకు పిలిచి ఉద్యోగం ఇవ్వరు. అందుకే ఉద్యోగానికి తగ్గ అర్హతను మనమే సంపాదించుకోవాలి. ప్రతి ఉద్యోగం నేటి సమాజంలో ప్రత్యేక సామర్థ్యాన్ని కోరేదే! అంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఆ ఉద్యోగానికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్లినా..కమ్యూనికేషన్లు, విశే్లషణా సామర్థ్యం, విష య పరిజ్ఞానం, అవగాహన..అన్నింటికీ మించి మనం పని చేసే సంస్థలో అందరితోనూ కలిసిపోయి, మమేకమై మరీ పనిచేయగలిగే లక్షణాల్ని కోరుతున్నాయి. వీటిలో ఏది మనలో లోపించినా అది తదుపరి ఎదుగుదలకు గుదిబండగానే మారుతుంది! ఏ ఉద్యోగానికి వెళుతున్నాము..ఒక వేళ అది వస్తే నేర్పుగా, ఓర్పుగా ముందుకెళ్లగలిగే వాస్తవికత మనకు ఉందో లేదో నిర్థారించుకోవాలి. అంటే..ఉద్యోగం రావడం ఎంత ముఖ్యమో..మన ప్రతిభా సంపత్తులను ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ..మన బలహీనతల్ని అధిగమిస్తూ ముందుకెళ్లడమూ అంతే ముఖ్యం. ముఖ్యంగా మూడు కీలకమైన అంశాల ప్రాతిపదికగానే నేడు ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అవి ప్రధానంగా కమ్యూనికేషన్లు, విశే్లషణా సామర్థ్యం, అందరితో కలిసి పనిచేసే లక్షణం. ఈ మూడు అనివార్యంగా ఉద్యోగార్థులందరిలో ఉండితీరాల్సిందే. వీటిలో ఏ లోపం ఉన్నా..ఏక్కడా రాణించే అవకావం లేదన్న వాస్తవాన్ని విస్మరించడానికి వీల్లేదు.
కమ్యూనికేషన్ స్కిల్స్
ఇది సక్సెస్‌కు మూలసూత్రం. ఎందుకంటే ఉద్యోగం అన్నది మీరొక్కరు మాత్రమే ఉండే ఆఫీసు కాదు. పదిమందితో, తోటి ఉద్యోగులందరితో కలిసి మెలసిపనిచేయాల్సిన పరిస్థితి అనివార్యంగానే ఉంటుంది. అంటే ఇందుకు ప్రధానంగా కావాల్సింది భావ వ్యక్తీకరణ సామర్థ్యం. మన ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా ఎదుటివారికి చెప్పగలిగే..ఒక రకంగా వారిని ఒప్పించగలిగే వాక్పటిమను ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలి. కమ్యూనికేషన్ సా మర్థ్యం లేకపోతే మీకు ఇతర అంశాల్లో ఎంత ప్రతిభ ఉన్నా..దాన్ని పదిమందీ గుర్తించే అవకాశం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే..మన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని స్పష్టంగా చెప్పలేకపోవడం అన్నది మన ఎదుగుదలను మనమే నిరోధించుకోవడమే అవుతుంది! చదవడం, రాయడం, వినడం వంటివి లక్షణాలు ఎంతగా ఉన్నా..మనం అనుకున్నది రాబట్టుకోవాలంటే..అనుకున్న విధం గా రాణించాలంటే మన మాటే విజయ బాట అవుతుంది. ఇది యాజమాన్యాల దృష్టిలో పడటానికి, మన బాస్ దృష్టి మనపై, మన ప్రతిభమై కేంద్రీకృతం కావడానికి దోహదం చేస్తుంది. సరైన భావవ్యక్తీకరణ పాటవం లేకపోతే ఎంత మేధావి గురించైనా పది మందికీ తెలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కమ్యూనికేషన్ లోపం అన్నది పెనుశాపమే అవుతుంది.
విశే్లషణా సామర్థ్యం
గతంలో ఉన్న ఉద్యోగాలు వేరు. నేటి పోటీ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లతో కూడుకున్న ఉద్యోగాలు వేరు. దాదాపు అన్ని ఆధునిక వృత్తులకూ ఈ విశే్లషణా సామర్థ్యం అత్యంత ముఖ్యం. అంటే వివేచన, విచక్షణతో కూడిన ప్రతిభ నేటి పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగానికీ ఎంతో అవసరమన్నమాట. అంటే ఏ ప్రాజెక్టును చేపట్టినా..లేదా ఓ కీలక బాధ్యతను నిర్వర్తించాలన్నా..అందుకు అవసరమైన వౌలిక వివరాలను సేకరించడంతో పాటు వాస్తవానుగుణంగా ప్రణాళికాయుతంగా ముందుకు వెళ్లాలి. ఇందుకు కేవలం అరకొర పరిజ్ఞానం, అవగాహన సరిపోదు. విషయం లోతుల్లోకి వెళితే తప్ప..అందుకు అవసరమైన విశే్లషణా పటిమను, సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎలాంటి సమస్యమైనా అధిగమించే లేదా ఎలాంటి అవరోధం తలెత్తకుండా ముందుగానే ఊహించి, విశే్లషించడం అన్నది ఆధునిక వృత్తుల్లో రాణించడానికి అత్యవసరం. ఈ సామర్థ్యం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికే కాదు..చిన్న చిన్న ఉద్యోగాలు కోరుకునే వారికీ ఎంతో అవసరం. ఎందుకంటే..ఈ రకమైన విశే్లషణా పటిమతోనే మనం చేసే పనిపట్ల లోతైన అవగాహన ఏర్పడుతుంది.
కలుపుగోలుతనం
కమ్యూనికేషన్ సామర్థ్యం, విశే్లషణా పటిమ ఎంతగా ఉన్నా...మనం పనిచేసే సంస్థలో పదిమందితో కలిసి పనిచేసే లక్షణం లోపిస్తే ఎలాంటి ప్ర యోజనం ఉండదు. ఆధునిక వృత్తుల్లో ఉన్న ఎవరికైనా అందరితో కలిసిపోయే లక్షణం అన్నది తదుపరి అడుగులు వేయడానికి అవసరమవుతుంది. నన్నుముట్టకు నామాల కాకి అన్నట్టుగా వ్యవహరిస్తే మాత్రం మన ఎదుగుదలను మనమే అడ్డుకున్నట్టవుతుంది. అందరితో కలిసి పనిచేయడం, పనిచేయించడమే ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి గీటురాయి అవుతుం ది. నేటి ఉద్యోగాల్లో ఇది మరీ కీలకం.

-బి.సుధ