జాతీయ వార్తలు

జాతీయ గీతాన్నే అవమానిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని అగౌరవ పరిచారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో నరేంద్ర మోదీని తప్పుపట్టారు. జాతీయ పతాకం, జాతీయ గీతం దేశ ప్రజల గుర్తింపు, సమగ్రత, గౌరవానికి ప్రతీక, వాటిపట్ల నరేంద్ర మోదీ అగౌరవంగా వ్యవహరించారని అన్నారు. ఈ ఘటనపై అత్యంత విచారంతో నరేంద్ర మోదీని విమర్శించవలసి వస్తోందని సుర్జేవాలా చెప్పారు. రష్యాలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు నరేంద్ర మోదీ ముందుకు నడిచిపోవటం విచిత్రంగా ఉందన్నారు. నరేంద్ర మోదీకి జాతీయ చిహ్నాల పట్ల గౌరవం, అవగాహన లేదనేది ఈ సంఘటన నిరూపిస్తోందని విమర్శించారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు కదలకుండా నిలబడతాం. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఒక కోటి ఇరవై లక్షల మంది దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఆయనే జాతీయ గీతం, జాతీయ పతాకాన్ని గౌరవించకపోతే ఎలా అని సుర్జేవాలా నిలదీశారు. జాతీయ గీతాన్ని, పతాకాన్ని గౌరవించకపోవటం అంటే దేశ ప్రజలను అగౌరవపరచటమేనని ఆయన స్పష్టం చేశారు. మోదీ జాతీయ చిహ్నాలను గౌరవించకపోవటం ఇది మొదటిసారి కాదు, గతంలో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరిగాయని ఆయన తెలిపారు. జపాన్ ప్రధాన మంత్రితో చర్చలు జరిపే సమయంలో జాతీయ పతాకాన్ని తలకిందులుగా పెట్టారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు బహుమతిగా ఇచ్చేందుకు జాతీయ పతాకంపై సంతకం చేశారు.