జాతీయ వార్తలు

పనిగట్టుకుని మసిబూశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి నగర విభాగంపై అనుమానాలు
కొన్ని శక్తుల పన్నాగమేనన్న అనంత్ గాడ్గిల్
‘కాంగ్రెస్ దర్శన్’ వ్యాసాలపై పార్టీలో అంతర్మథనం

ముంబయి, డిసెంబర్ 29: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీని అప్రతిష్ఠ పాలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రచార పత్రికల్లో వ్యాసాలు రావడంతో చిక్కుల్లోపడిన ముంబయి కాంగ్రెస్ విభాగం ఈ వ్యాసాల ప్రచురణ, అవి మీడియాకు లీక్ కావడం నగర పార్టీ విభాగంలో ఉండే కొంతమంది వెన్నుపోటుదారుల పనే అయి ఉండవచ్చని భావిస్తోంది. కాగా, ముంబయి పార్టీ విభాగం ఈ ఉదంతంపై ఇచ్చిన వివరణతో పార్టీ అధినాయకత్వం సంతృప్తి చెందిన తర్వాత ఈ వ్యవహారాన్ని ముగిసిపోయినట్లుగా పార్టీ పరిగణిస్తోందని ఏఐసిసి సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
అయితే, నెహ్రూపై వచ్చిన వ్యాసం నెహ్రూ, సర్దార్ పటేల్‌ల మధ్య సంబంధాలు సరిగా లేవని ప్రచారం చేయడానికి భారత రాజకీయాల్లోని కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా సాగిస్తున్న ప్రచారంలో భాగమై ఉండవచ్చని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అనంత్ గాడ్గిల్ పుణెలో విలేఖరులతో అన్నారు.
జమ్మూ, కాశ్మీర్‌పైన, చైనాపైన నెహ్రూ విధానాలను ప్రశ్నించడంతో పాటుగా సోనియా గాంధీ తండ్రి ఫాసిస్ట్ సైనికుడని పేర్కొంటూ ‘కాంగ్రెస్ దర్శన్’ పత్రికలో వ్యాసాలు రావడం సంచలనం సృష్టించడం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవానికి ఒక రోజు ముందు పార్టీ ప్రచార పత్రికలో వచ్చిన ఈ వ్యాసాలు పార్టీకి పెద్ద ఇబ్బందికరంగా మారింది. ముంబయి కాంగ్రెస్ విభాగం ప్రచురిస్తున్న ఈ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్న ఎంఆర్‌సిసి అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ ఈ పొరబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పడం తెలిసిందే. కాగా సంజయ్ నిరుపమ్‌ను టార్గెట్‌గా చేయడానికి ఆయన ప్రత్యర్థులే పార్టీ పత్రికలోని ఈ వ్యాసాల గురించి మీడియాకు లీక్ చేసి ఉంటారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మ్యాగజైన్ కంటెంట్ ఎడిటర్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన సుధీర్ జోషీని నిరుపమ్ ఆ పదవినుంచి ఇప్పటికే తొలగించారు. 2007-2011 మధ్య కాలంలో కృపాశంకర్ సింగ్ ముంబయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ విధానాలు, సుసంపన్నమైన దాని వారసత్వం గురించి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ‘కాంగ్రెస్ దర్శన్’ మ్యాగజైన్‌ను ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం ఈ మ్యాగజైన్ ఆగిపోగా, స్వయానా జర్నలిస్టు అయిన సంజయ్ నిరుపమ్ దాన్ని తిరిగి ప్రారంభించారు. గత నవంబర్‌లో మొదటి సంచిక వచ్చింది. మొదట మరాఠీ ఎడిషన్‌లో వచ్చిన వ్యాసాలను తర్జుమా చేసి ప్రచురించాలని భావించామని, అయితే స్వతంత్ర వ్యాసాలు ఉంటే బాగుంటుందని జోషీ అభిప్రాయపడ్డారని సంజయ్ తెలిపారు.