జాతీయ వార్తలు

సీజేఐపై అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన ఉపరాష్ట్రపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి వెళ్లిన ఉపరాష్ట్రపతి.. కొంతమంది న్యాయ నిపుణులతో అభిశంసన తీర్మానంపై చర్చించారు. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా, శాసనసభ మాజీ కార్యదర్శి సంజయ్ సింగ్, రాజ్యసభ సీనియర్ అధికారులను వెంకయ్యనాయుడు సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు.