ఉత్తరాయణం

ఏకాభిప్రాయ సాధన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖర్చుపెట్టే ప్రతి రూపాయకీ ముప్పయ పైసలు పన్ను రూపేణా చెల్లించి కొనాల్సిన దుస్థితి భారతీయులది. విదేశీ బ్యాంకుల్లో దాచిన వేలకోట్ల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చే యత్నాలు సఫలం కావడం లేదు. అదేవిధంగా విదేశాలకు అక్రమంగా తరలిపోతున్న నల్లధనాన్ని ఆపగలిగే సామర్ధ్యం కొరవడుతున్నది. పన్ను రూపేణా ప్రజలపై భారీగా ప్రజలపై భారం వేయడంలో ప్రభుత్వాలు వెనుకడుగు వెయ్యవు. తాజాగా విదేశాలలో మాదిరిగా లెక్కకు మిక్కిలి పరోక్ష సుంకాల స్థానే ఒకే ఒక వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రూపేణా సంస్కరణల విధానానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టిన శుభ సంకల్పానికి అడుగడుగునా బాలారిష్టాలు ఎదురవుతు న్నాయ. తొలుత పార్లమెంటులో, తర్వాత స్థాయా సంఘ పరిశీలనలో మూడేళ్లు పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు ప్రస్తుతం రాజకీయ కారణంగా ఆమోదం పొందలేక పోతున్నది. జిఎస్‌టి చేపట్టుతున్న కీలక ఆర్థిక సంస్కర ణలకు తమకు రాజ్యసభలో ఉన్న మెజారిటీ కారంణంగా విపక్షం అడ్డు పడుతోంది. లోక్‌సభలో ఉన్న బలం వల్ల ప్రతిపక్షాలను కలుపుకుపోకుండా ఏకపక్ష ధోరణితో భాజపా వ్యవహరిస్తుండడం వల్ల జిఎస్‌టి బిల్లు భవి తవ్యం అగమ్యగోచరంగా తయారయ్యంది. ఈ మధ్యలో అనేక రాష్ట్రాలు సంకుచిత ఎజెండాలను తీసుకొచ్చితమ వంతుగా సైంధవ పాత్రను పోషిస్తున్నాయ. వీటిని బుజ్జగించడానికి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వస్తువుల తరలింపుపై రెండేళ్లపాటు ఒకశాతం అదనపు లేవీని విధిస్తామని భాజపా ప్రకటించి ఏకరూప పన్నుల వ్యవస్థ వౌలిక స్ఫూర్తికే తూట్లు పొడిచింది. స్థిరాస్తి రంగాన్ని ఈ బిల్లు పరిధిలోకి చేర్చకపోవడం పట్ల అనేక రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయ. జాతి ప్రయో జనాలకు శ్రేయస్సు కలిగించే జిఎస్‌టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం, భేషజాలను పక్కన బెట్టి మరిం త క్రియాశీలకంగా వ్యవహరించి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలి.
- సి. సాయమనస్విత, విజయవాడ
సంస్కృత పాఠశాల
విజయనగరంలో సంస్కృత, కళాశాల ప్రాచీన సంస్కృతులను, మేళవించి విద్యార్థులకు ఆశాదీపంగా మెలిగేది. అటువంటి పాఠశాల మూసివేసే స్థితికి రావడం శోచనీయం. మాన్సాస్ వారు రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్‌వారు ముందడుగు వేసి కళాశాల పునరుద్ధరణకు చేయూతనిచ్చి భావితరాలకు మేలుచేయాలని కోరుతున్నాను. ఈ పాఠశాల పూర్వవిద్యార్థులు సహకారం ఇస్తే ముదావహం.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
ప్రార్థనాలయాల పట్ల ఇంత నిర్లక్ష్యమా?
ప్రకృతి వైపరీత్యాలు లేక ఇతర కారణాలవలన ప్రార్థనా స్థలాలు శిథిలావస్థకు చేరుకుంటే హిందూ దేవాలయాల పునరుద్ధరణకు అతీగతీ లేకుండాపోతోంది. కారణమడిగితే నిధుల కొరత అంటున్నారు. మరి కొన్ని దేవాలయాలు కనీసం నిత్య పూజకు కూడా నోచుకోవడం లేదు. అదే అన్యమతస్థుల ప్రార్థనా స్థలాల ఆధునీకరణ లేక జీర్ణోద్ధారణకోసం నిధుల వరద వెల్లువలా వచ్చిపడుతోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో అత్యుత్సాహం కనబరుస్తుంటుంది. లౌకిక వాదం స్ఫూరితతో పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు ఒక మతం అదీ మెజారి టీ మతస్థుల పట్ల నిర్లక్ష్య భావం వహించడానికి కారణం?
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
గ్రామపాలనా వ్యవస్థ అస్తవ్యస్తం
ఎంతోకాలం నుండి పటిష్టత కలిగి గ్రామ పాలన వ్యవస్థకు వనె్నతెచ్చి 24 సంఖ్యగల గ్రామ లెక్కల విధానం ఎంతో విలువైనది. నేడు గ్రామ పరిపాలన వ్యవస్థ కుంటుపడి అది అగమ్యగోచరంగా అసమర్ధతగా అవగాహన లేని వివిధ రకాలైన సమస్యల కూటమిగా ఏర్పడి ప్రజలకు అవరోధంగా ఏర్పడింది. గ్రామ పాలనకు వెనె్నముక వంటి గ్రామాధికార వ్యవస్థ విచ్ఛిన్నం కావడం ఎంతో విచారకరమైన దుస్థితికి దిగజారి అవినీతి అమానుషమైన సందిగ్ధ పర్థితులకు నిలువుటద్దంగా నిలచింది. సర్వే నెంబర్లు, పొలం విస్తీర్ణం యొక్క ఉనికి పటములు తారుమారు అయి ప్రజావ్యవస్థ ఊబిలో దిగబడిపోయింది. ఇంతే సంగతులేనా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
హెల్మెట్ బదులు తలపాగా
హెల్మెట్ బరువు ఎక్కువ, సైజు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ. అదే గుడ్డతో చేసిన తలపాగా అయితే తలకు 2,3చోట్ల గడ్డం క్రింద 1 చుట్టు చుట్టుకుంటే హాయిగా వుంటుంది. సురిక్షితంగా వుంటుంది. ఖరీదు తక్కువ. హెల్మెట్ వలన కలిగే ఉపయోగాలన్నీ తలపాగా వల్ల కూడా వుంటాయి. ఈ పద్ధతి సుప్రీంకోర్టుకు కూడా చెప్పాలి. నచ్చచెప్పాలి. మరియు ఈ పద్ధతులన్ని ఐచ్ఛికంచేయాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
ఎవరు వికలాంగులు?
యాసిడ్ బాధితులను వికలాంగుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలు కేంద్ర పాలితాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకంటే ఎక్కువ శ్రమించేవారు అనేక పనులుచేస్తూ కాళ్ళు, చేతులు విరిగిపోయినారు. ఏ పనిచేయలేక మంచానికి అతుక్కొని వుండేవారిని గూడా వికలాంగుల జాబితాలో చేర్చవచ్చునుగదా?
- శ్రీమతి మునె్నల్లి కనకమ్మ, కావలి