సంజీవని

పిల్లల్లో మలబద్దకం పోయేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక సమాజంలో చాలామంది పిల్లలను వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్దకం. దీనికి ప్రధాన కారణం మారిన జీవన విధానం, చిరుతిండ్లకు ఎక్కువగా అలవాటుపడటం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకపోవడం, పీచు ఉన్న పదార్థాలు తినకుండా రోజులో ఎక్కువసార్లు ఫాస్ట్ఫుడ్స్ తీసుకోవడంవలన మలబద్దకం నేడు ప్రధాన సమస్యగా తీవ్రరూపం దాల్చుతుంది.
మలబద్దకమే కదా అని తేలికగా తీసుకుంటే.. పిల్లలకు వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్దకమే’ మూలకారణంగా ఉంటుంది. మలబద్దకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆధునిక జీవన విధానంలో కొన్ని మార్పులు చేయుటవలన పిల్లల్లో మలబద్దకం సమస్యను నివారించవచ్చు.
మలబద్దకానికి కారణాలు
- ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవటం.
- కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టానిక్స్ అతిగా వాడటం.
- ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వలన
- వేళకు మలవిసర్జనకు వెళ్ళే అలవాటు పిల్లలకు తల్లిదండ్రులు చేయకపోవడం
- రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవడంవలన మలబద్దకం ఏర్పడుతుంది.
లక్షణాలు
-తేన్పులు ఎక్కువగా ఉండటం. మల విసర్జనకు వెళ్లాలంటేనే పిల్లలు భయపడిపోవడం.
- గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినటుగా ఉండటం, రాత్రి నిద్ర పట్టకపోవడం.
- కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడం
- మల విసర్జన సరిగా పూర్తిగా కాదు. ఎప్పుడు చూసినా నీరసంగా ఉండటం.
- తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, కడుపునొప్పి అని ఏడవటం, వాంతులు కావడం.
జాగ్రత్తలు
-పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైన్‌ఆపిల్, బత్తాయి, సపోట పండ్లను పిల్లలకు ఎక్కువగా తినిపించాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకు కూరలు నిత్యం పిల్లలకు పెట్టడంవలన మలవిసర్జన త్వరగా సాఫీగా జరుగుతుంది.
- ఫాస్ట్ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు వంటి ఆహార పదార్థాలను తినే అలవాటును మానిపించాలి.
-నిలువ వుంచిన పచ్చళ్లు, కాఫీ, టీలు పిల్లలకు ఇవ్వకూడదు.
-వేళకు ఆహారం తీసుకుంటూ, నీరు సరిపడినంతగా తాగే అలవాటు చేయాలి.
- స్కూలు మరియు చదువు ఒత్తిడిని నివారించడానికి యోగా, వ్యాయామము, ప్రాణాయామము, మెడిటేషన్ వంటివి పిల్లలకు నేర్పించాలి.
చికిత్స
హోమియో వైద్యంలో ‘మలబద్దకం’తో బాధపడే పిల్లలకు మంచి చికిత్స ఉంది. శారీరక, మానసిక లక్షణాల ఆధారంగా మందులను ఎంపిక చేసుకొని ఇవ్వడంవల్ల వ్యాధి సమూలంగా నివారణ అవుతుంది.
మందులు
నక్స్‌వామికా, కాల్కేరియా కార్బ్, బ్రయోనియా, ఓపియం, అల్యూమినా, గ్రాఫైటిస్, సల్ఫర్, సైలీషియా, ప్లంబం వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడితే పిల్లల్లో మలబద్దకం సమస్యను నివారించవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646