బిజినెస్

వినియోగదారులు మేల్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినియోగదారుల దినోత్సవంలో మంత్రుల పిలుపు
అనంతపురం , డిసెంబర్ 24: సమాజాన్ని కలవరపెడుతున్న కల్తీ సమస్యను వ్యాపారులు, అధికారులు, వినియోగదారులు సమిష్టి కృషితో నివారించాలని, తద్వారా ఆరోగ్యాన్ని రక్షించాలని మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీతలు అన్నారు. గురువారం అనంతపురం నగరంలోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జాతీయ వనియోగదారుల దినోత్సవం రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు పల్లె, సునీత ఆహారం, పాలు, విత్తనాలు ఇలా ఏ ఒక్క పదార్థం చూసినా కల్తీ ఉంటోందన్నారు. కల్తీవల్ల వినియోగదారులు నష్టపోతున్నారన్నారు. వ్యాపారులు, అధికారులు, వినియోగదారులు సమిష్టిగా ఈ సంమస్యను నివారించేందుకు కృషి చేయడం ద్వారా కల్తీ సమస్యకు చరమగీతం పాడగలమన్నారు. కల్తీ పదార్థాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దన్నారు. వ్యాపారులు నైతిక, సామాజిక విలువలు పాటిస్తూ ధర్మంతో నడచుకోవాలని తెలిపారు. వినియోదారులు తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు నాణ్యత ప్రమాణాలతో పాటు, తేదీ గమనించాలన్నారు.
తక్కువ ధర చూసి మోసపొకుండా మహిళలు నాణ్యమైన వస్తువులనే కోనుగోలు చేయాలన్నారు. కల్తీ నివారణకు ప్రభుత్వంతో ప్రజలు చేతులు కలపాలన్నారు. చౌకదుకాణాల ద్వారా వినియోగదారులకు సరకులు సక్రమంగా అందించాలనే ఆలోచనతో ఈ-పాస్ విధానం అమలుచేశామన్నారు. రాష్ట్రంలో 29 వేల దుకాణాల్లో ఈ-పాస్ విధఆనాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రిదేకే దక్కుతుందన్నారు. అనంతరం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. వివిధ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, రాష్ట్ర కన్సూమర్ డిప్యూటీ రిడ్రెసల్ కమిషన్ అధ్యక్షులు జస్టిస్ నేషద్ అలీ, పౌర సరఫరాల శాఖ కమిషన్ జయలక్ష్మి, జెడ్పి ఛైర్మెన్ చమన్‌సాబ్, కలెక్టర్ కోనశశిధర్, జెసి-1 లక్ష్మికాంతం, వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు ప్రమీలారెడ్డి, నాగేశ్వరరావు, సురేష్‌కుమార్, నబీరసూల్, రవీంద్రరెడ్డి, ఆర్‌డిఓలు కెఎస్.రామారావు, హుస్సెన్‌సాబ్, డిఎస్‌ఓ ప్రభాకర్‌రావు, సివిల్ సప్లయిస్ డిఎం శ్రీనివాసులు, జిల్లా అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.