ఐడియా

కూల్ కూల్‌గా.. గొంతులో హాయిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి ఎండలు అప్పుడే చురుక్కుమనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మున్ముందు భాను డు మరింత ప్రతాపం చూపించబోతున్నాడు. వేస వి తాపం నుంచి ఉపశమనం పొందడానికి, వడదెబ్బ తగలకుండా ఉండటానికి, చక్కటి ఆరోగ్యానికి కొబ్బరినీళ్లు ఉపకరిస్తాయి. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరిబోండాలలోని నీళ్లలో ఉండే ఖనిజ లవణాలు అప్పటికప్పుడు శక్తిని అందజేస్తాయి. వీటిలో అతి తక్కువగా ఉండే కొవ్వు పదార్థం వల్ల లావెక్కకుండా ఉంటారు. వీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్, నీటివల్ల తక్షణం శక్తి అందడం, చర్మం నిగారింపుతో ఉండటం సాధ్యమవుతుంది. మనిషికి అవసరమైన ఐదు రకాల ఎలక్ట్రోలైట్స్ కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం ఇందులో తగిన మోతాదులో ఉంటాయి. పరిమిత స్థాయిలో గ్లూకోజ్ కూడా ఉంటుంది. అందువల్లే అస్వస్థతకు గురైన రోగికి ఎక్కించే ఫ్లూయిడ్స్‌కన్నా వేగంగా ప్లాస్మాలో కలిసిపోవడం కొబ్బరినీళ్ల ప్రత్యేకత. వీటిన తాగిన కొద్దిసేపటికే శక్తి అందుతుంది. అధిక రక్తపోటును నియంత్రించేందుకు కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. క్రీడాకారులు శక్తికోసం వాడే ‘ఎనర్జిడ్రింక్స్’ కన్నా ఇవి పుష్టికరమైనవంటే కొబ్బరినీళ్ల ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది. ఎనర్జీడ్రింక్స్‌లోకన్నా కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. గ్లూకోజ్ పరిమితంగా, సోడియం స్వల్పంగా ఉంటుంది. ఒ గ్లాసుడు కొబ్బరి నీళ్లలో 294 మి.గ్రా.ల పొటాషియం, 5 మి.గ్రా. సహజ లవణాలుంటాయి. అదే ఎనర్జీడ్రింక్‌లో 150 మి.గ్రా పొటాషియం, కొబ్బరినీళ్లలోకన్నా ఐదురెట్ల ప్రాసెస్‌డ్ సుగర్, సోడియం ఉంటాయి. వీటివల్ల దుష్పరిణామాలుంటాయి. కానీ కొబ్బరినీళ్లవల్ల ఎటువంటి చెడు జరగదు. కొబ్బరినీళ్లలో కనీకన్పించకుండా ఉండే పీచుపదార్థంవల్ల పేగులు శుభ్రపడతాయి. ఏ విధంగా చూసినా వేసవికాలంలో తక్షణశక్తి కలగడానికి, ప్రాణరక్షణకు దీన్ని మించిన మరో పదార్థం లేదంటే అతిశయోక్తికాదు. *