బిజినెస్

చెన్నైకి కార్పొరేట్ల చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీగా పాలు, నీరు, ఆహార ప్యాకెట్ల సరఫరా

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన చెన్నై నగర ప్రజలకు కార్పొరేట్ సంస్థలు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందిస్తున్నాయి. పాలు, నీరు, ప్యాకేజ్డ్ ఆహార పదర్థాలను అందిస్తూ, తమ ఉదారతను చాటుకుంటున్నాయి. నెస్లే ఇండియా, ఐటిసి, ఎమ్‌టిఆర్, బ్రిటానియా, పార్లే, కొకాకోలా ఇండియా, పెప్సికో సంస్థలు వరద బాధిత ప్రాంతాలకు పెద్ద ఎత్తున నీరు, ఆహార పదార్థాలను సరఫరా చేశాయి. 10 మిలియన్ టన్నుల మ్యాగీ నూడుల్స్, 5,000 లీటర్ల టెట్రా ప్యాక్డ్ పాలు, 50,000 కాఫీ ప్యాకెట్లను బాధితుల సహాయార్థం అందించింది. మరో 25-30 మిలియన్ టన్నుల నూడుల్స్, దాదాపు 8 మిలియన్ టన్నుల మంచ్, 800 కిలోల సన్‌రైజ్ బిస్కట్లను నెస్లే ఇండియా పంపిణీకి సిద్ధం చేసిందని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే ఐటిసి 6 ట్రక్కుల్లో 3,163 బాక్సుల బిస్కట్లను సరఫరా చేయగా, తినేందుకు సిద్ధంగా ఉన్న 14,128 ఆహార పొట్లాలను ఎమ్‌టిఆర్ ఇప్పటికే పంపించింది. అంతేగాక మరో 35,000 ప్యాకెట్లను సరఫరాకు సిద్ధమైంది. సోమవారం ఇవి వరద బాధితులకు పంపిణీ అవుతాయని సదరు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక పార్లే సంస్థ కూడా 3 ట్రక్కుల బిస్కట్లను సరఫరా చేసినట్లు తెలిపింది. మరోవైపు బ్రిటానియా సంస్థ 3 ట్రక్కుల్లో 345 బాక్సుల బిస్కట్లను ఇవ్వగా, మరో రెండు ట్రక్కుల బిస్కట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాలు, బ్రెడ్లను కూడా అందిస్తోంది. ఇదిలావుంటే శీతలపానియాల తయారీ సంస్థలైన కొకాకోలా, పెప్సీకోలు సైతం ముందుకొచ్చాయి. 50,000 లీటర్ల వాటర్ బాటిళ్ళను కొకాకోలా సరఫరా చేయగా, 12,000 లీటర్ల వాటర్ బాటిళ్ళను పెప్సికో ఆదివారం అందించింది.