తెలంగాణ

అవినీతి చేపలపై ఏసిబి కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టపాసుల అనుమతి కోసం డబ్బుల వసూలు
మంచిర్యాల, డిసెంబర్ 4: దీపావళి పర్వదినం సందర్బంగా టపాసులు విక్రయించే దుకాణాలకు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్న అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా ఝులిపించింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న పది మంది అధికారులు, సిబ్బంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. టపాసులు విక్రయించేందుకు అనుమతుల కోసం సుమారు 20వ్యాపారులు సంబంధిత అదికారులకు దరఖాస్తులు చేసుకోగా, డబ్బులు ఇస్తేనే అనుమతులు ఇస్తామని చెప్పడంతో విక్రయదారులు ఏసీబీ డిజిపికి నేరుగా ఆడియో, వీడియోల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో మంచిర్యాలలోని రెవెన్యూ, ఫైర్, మున్సిపాలిటీ, పోలీసు, విద్యుత్ తదితర శాఖలలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిపై జిల్లా ఎసీబీ దృష్టి సారించింది. ఏసీబీ అదికారులు మంచిర్యాలలో మకాం ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ నిర్వహించారు. వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేసిన విషయాన్ని ఆడియో, వీడియోల రికార్డులను పరిశీలించి సంబందిత అధికారులను గుర్తించి కేసులు నమోదు చేశారు. ఫైర్ అధికారి రాజన్నతో పాటు కానిస్టేబుల్‌కు వ్యాపారులు రూ.69వేలు చెల్లించగా, మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, క్లర్క్ అంజయ్యకు రూ.37వేలు, తహసిల్దార్ కార్యాలయంలోని డిటి లక్ష్మిరాజం, ఆర్ ఐ గణేష్‌లకు రూ.30వేలు, పోలీసు శాఖలో దరఖాస్తులపై సి ఐ సంతకం చేయగా కానిస్టేబుల్ రామేశ్వర్ రూ.3వేలు తీసుకున్నారు. అదే విధంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఏ ఈ రవీందర్‌కు కూడా డబ్బులు నేరుగా అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో సూపరింటెండెంట్ రాజానందం, సిసి రాజన్నలకు రూ.10వేలు ఇచ్చేందుకు వెళ్లగా కార్యాలయం ముందు ఉన్న సాయి జిరాక్స్ సెంటర్‌లో అందజేయాలని తెలుపడంతో వ్యాపారులు డబ్బులు జిరాక్స్ సెంటర్‌లో అందజేసినట్లు తెలిపారు. 12/ ఆర్‌సివో- ఏసీబీ- ఏడీబీ/ 2015 కింద 16.11.2015న కరీంనగర్ ఏసీబీ కోర్టులో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసినట్లు ఏసీబీ డీ ఎస్పీ పాపాలాల్ తెలిపారు. ఈ అవినీతికి పాల్పడిన అధికారులు ఒక్కో షాపు నుంచి రూ.2500 నుంచి రూ.3500 వరకు అక్రమంగా వసూలు చేయడంతో చార్జి షీట్లు నమోదు చేసినట్లు తెలిపారు. నేరం రుజువైన పక్షంలో సంబంధిత అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు డి ఎస్పి పేర్కొన్నారు.