ఆంధ్రప్రదేశ్‌

సచివాలయ నిర్మాణ పనుల్లో స్థానికేతరులకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని యువత ఆశలపై నీళ్లుచల్లిన సిఆర్‌డిఏ

గుంటూరు, మార్చి 17: తాత్కాలిక సచివాలయ పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన అర్హులైన యువతీ యువకులకు నిర్మాణ పనుల్లో అవకాశం కల్పించక పోవటంపై ఆందోళన వ్యక్తవౌతోంది. రాజధాని ప్రాంతంలో జరిగే నిర్మాణాల్లో యువతకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి సిఆర్‌డిఎ, రెవిన్యూ అధికారుల వరకు విస్తృత ప్రచారం కల్పించి ప్రస్తుతం మొండిచెయ్యి చూపటంపై ఆ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అయితే రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సచివాలయ నిర్మాణ పనుల్లో 29 మందికి ఉపాధి కల్పించామని చేసిన ప్రకటనపై స్థానికులు మండిపడుతున్నారు. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన బిటెక్ విద్యార్థి వర్ధన్ మాట్లాడుతూ సచివాలయ నిర్మాణ పనుల్లో ఉన్న ఆ 29 మంది ఎవరో మంత్రి నారాయణ వెల్లడించాలని డిమాండ్ చేశారు. గతంలో రాజధాని అమరావతిలో భూసమీకరణ ప్రారంభించిన సమయంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు యువతీ యువకులకు, రైతుకూలీలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రచారం చేశారన్నారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామంటూ చెప్పిన మాటలను గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా రాజధానిలో గ్రామాల్లో అర్హులైన యువతను గుర్తించేందుకు సిఆర్‌డిఎ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సుమారు 6,000 మంది యువకులు ఉన్నట్లు గుర్తించారన్నారు. వారిలో 549 మందికి మాత్రమే 16 ట్రేడ్‌ల్లో శిక్షణ ఇచ్చారు. అందులోభాగంగా శ్రీకాకుళం జిల్లా ఎడ్చర్లలో 113 మంది యువతీ యువకులు శిక్షణ పొందారు. శిక్షణ కాలం 4 నెలలు గడిచినప్పటికీ సక్రమంగా జరగక పోవటంతో వారంతా తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన విషయాన్ని ఆప్రాంతవాసులు గుర్తుచేస్తున్నారు. శిక్షణ కాలంలో రూ.3,000 స్ట్ఫైండ్ ఇస్తామని చెప్పిన అధికారులు కేవలం రూ.1,500 మాత్రమే ఇచ్చారని తాడేపల్లి మండలం పెనుమాక బిటెక్ విద్యార్థి బి తేజ చెప్పారు. ఒక్కొక్క విద్యార్థికి శిక్షణ కాలంలో 45 వేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు అయినట్లు తెలిపారు. అంతేకాకుండా విలువైన 4 నెలల కాలం వృథా అయిందంటూ ధర్నా చేపట్టటంతో సిఆర్‌డిఎ ఉన్నతాధికారులు దిగివచ్చి వారితో మంతనాలు జరిపినప్పటికీ ఎటువంటి ఫలితం లభించలేదు. భూములిచ్చే సమయంలో ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమైనాయి. నిర్మాణపు పనుల్లో ఉపాధి లభిస్తుందని ఆశపడ్డారు. పనుల్లో ఎవరికీ అవకాశం లభించక పోవటంతో ఐటిఐ పూర్తి చేసిన 21 మంది ఇటీవల సిఆర్‌డిఎ అధికారులను కలిసి అవకాశం కల్పించాలని కోరారు. అయితే అధికారుల నుంచి సరైనా సమాధానం లభించక పోవటంతో నిరాశ చెందారు. సచివాలయ పనుల్లో మూడు షిప్టుల్లో 500 మంది కార్మికులు పని చేస్తున్నప్పటికీ రాజధాని గ్రామాలకు చెందిన వారు ఒక్కరు కూడా లేకపోవటం గమనార్హం. ఒరిస్సా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సచివాలయ పనుల్లో నిమగ్నమైనారు.