క్రీడాభూమి

మిథాలీ రాజ్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహిళా క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ నెలకొల్పింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (191) పేరిట ఉన్న రికార్డును నాగ్ పూర్ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభమైన తొలి వన్డేతో మిథాలీ రాజ్ (192) అధిగమించింది. ఇప్పటికే ఆమె ఖాతాలో అంతర్జాతీయ వన్డే మహిళా క్రికెట్ లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్ రికార్డు భద్రంగా ఉంది. రెండుసార్లు భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచకప్‌ ఫైనల్స్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌ కూడా ఆమే కావడం విశేషం.