క్రీడాభూమి

నమీబియా క్రికెటర్‌వాన్ షూర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదానంలోనే గుండెపోటు చికిత్స పొందుతూ మృతి
విండోక్, నవంబర్ 21: ఒక మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురైన నమీబియా క్రికెటర్ రేమండ్ వాన్ షూన్ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతి చెందాడు. నమీబియా జట్టుకు వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్న 25 ఏళ్ల వాన్ షూర్ సమర్థుడైన బ్యాట్స్‌మన్‌గానూ గుర్తింపు పొందాడు. ఆరంజ్ ఫ్రీ స్టేట్ జట్టుతో ఐదు రోజుల క్రితం ఇక్కడ జరిగిన మ్యాచ్ ఆడుతూ అతను అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. మంచినీళ్లు కావాలని సంకేతమిచ్చిన అతను, వాటర్ బాటిల్‌ను తెచ్చేలోపే స్పృహతప్పి పడిపోయాడు. సహచరులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, అతనిని బతికించడానికి ఐదు రోజులు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు ప్రకటించారు. వాన్ షూర్ కెరీర్‌లో 92 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 4,303 పరుగులు సాధించాడు. అందులో ఐదు శతకాలు, 20 అర్ధ శతకాలు ఉన్నాయి. మీడియం పేస్ బౌలర్‌గానూ అతను సేవలు అందించడం విశేషం. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతను 28 వికెట్లు పడగొట్టాడు. నమీబియా తరఫున 18 వనే్డ మ్యాచ్‌లు ఆడి 2,618 పరుగులు సాధించాడు.