క్రైమ్/లీగల్

హాజీపూర్ కేసు విచారణ 17వ తేదీకి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, జనవరి 8: భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామం ముగ్గురు బాలికల హత్యాచార కేసు విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది. బుధవారం నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తరఫున డిఫెన్స్ లాయర్ వాదనలు వినిపించారు. బుధవారం నాటితో ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌ల వాదనలు పూర్తవ్వగా ఇంకేదైనా వాదనలు వినిపించాలనుకుంటే చివరకు ఈనెల 17వ తేదీ విచారణ సందర్భంగా వినిపించాలని ఇరువర్గాలకు జడ్జి సూచించారు. జడ్జి సూచనల నేపథ్యంలో 17వ తేదీ విచారణ పిదప జడ్జిమెంట్ తేదీ ఖరారయ్యే అవకాశముంది.