క్రైమ్/లీగల్

పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, జనవరి 8: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఒకే కేసులో విచారణ నిమిత్తం తీసుకువచ్చిన నిందితుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఉదయం సుమారు 8.30 గంటలకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన నాగేశ్వరరావు అనే అనుమానిత నిందితుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మోటార్‌సైకిళ్ల్లు దొంగతనం చేశాడన్న అనుమానంతో పాత నేరస్థుడైన నాగేశ్వరరావును విచారణ నిమిత్తం వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్న అతను ఉదయం టాయ్‌లెట్‌కని వెళ్లి బాత్‌రూంలోని బల్బును తీసుకుని పగులగొట్టి మింగాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించేందుకు అతన్ని హైద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే తాను మూడు సంవత్సరాలుగా ఎలాంటి దొంగతనాలు చేయడం లేదని గతంలో చేసానని నిందితుడు పేర్కొన్న విషయాన్ని డీఎస్‌పీ వై.వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. నిందితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. నేరం చేసిన వాడు ప్రతి ఒక్కడూ తాను చేయలేదనే చెబుతాడని అతను కూడా నేరం చేయలేదని చెబుతున్నాడన్నారు. కేసును పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు.