క్రైమ్/లీగల్

తెల్లారిన పాలమూరు బతుకుకూలిన గోడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జనవరి 8: లక్డీకపూల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారుల నివాస ప్రాంగణం ప్రహరీ గోడ కూలి దినసరి కూలి మృతి చెందిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పాలమూరుకు చెందిన మహేశ్వర్ రెడ్డి(24) హకీంపేటలో నివాసం ఉంటూ రోజు వారి కూలి పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తుంటాడు. ప్రహరీ గోడ శిధిలం కావడంతో పుననిర్మాణ పనులు ప్రారంభించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రహారి గోడ కూలి శిధిలాలు మహేశ్వర్ రెడ్డిపై పడటంతో, తీవ్ర గాయాలు కావటంతో, మహావీర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని అన్నారు.