క్రైమ్/లీగల్

ఐపీఎస్‌నని చెప్పి.. అడ్డంగా దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 8: శ్రీవారి దర్శనం కోసం ఐపీఎస్ అధికారినని అబద్ధం చెప్పి శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్‌లు కొన్న తెలంగాణ ప్రభుత్వ జౌళి శాఖ డైరెక్టర్ ఎస్. అరుణకుమార్ పాండే విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిన సంఘటన బుధవారం తిరుమలలో జరిగింది. గత యేడాది డిసెంబర్ 13వ తేదీన కూడా ఓ వ్యక్తి ఐ ఆర్ ఎస్ అధికారినని నకిలీ ఐడీ కార్డును సృష్టించుకొని విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన విషయం పాఠకులకు విదితమే. 21 రోజులు కూడా గడవక ముందే తాజాగా మరో నకిలీ ఐడీ కార్డును సృష్టించిన అధికారి శ్రీవారి దర్శనం టికెట్‌ల కోసం మోసం చేసి పట్టుబడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. డీఎస్పీ ప్రభాకర్ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 1990 బ్యాచ్‌కు చెందిన సివిల్ సర్వీస్ అధికారి అరుణ్‌కుమార్ పాండే గతంలో ఉమ్మడిరాష్ట్రంగా ఉన్నపుడు ముఖేష్ గౌడ్ మంత్రిగా పనిచేసినపుడు ఓఎస్‌డీగా పనిచేశారు. ఆ సమయంలో ఓ ఐడీకార్డు పొందాడు. అటు తరువాత కూడా ఆ ఐడీ కార్డును ఉపయోగించుకొని తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ వచ్చాడు. తాజాగా అరుణ్‌కుమార్ పాండే సృష్టించుకున్న నకిలీ ఐడీ కార్డు 1998 బ్యాచ్‌కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిదని పోలీస్ విచారణలో తేలిందన్నారు.
ఇదిలావుండగా, అరుణ్‌కుమార్ పాండే ఐపీఎస్ అధికారి పేరుతో దీపిక అభిరామి అనే మరో మహిళ పేరుతో తిరుమల అడిషనల్ ఈఓ కార్యాలయానికి వచ్చి రెండు వీఐపీ టికెట్‌ల కోసం దరఖాస్తు చేసుకొని నకిలీ కార్డును ఆధారంగా ఉంచారు. టికెట్‌లను మంజూరు చేసిన అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి పోలీసులకు కేటాయించిన టిక్కెట్ల జాబితాను సీఐ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. అరుణ్‌కుమార్ పాండే పేరుతో ఐపీఎస్ అధికారి లేరని సీఐ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు.
అయితే బుధవారం ఉదయం వైకుంఠం కాంప్లెక్స్ వద్ద వీ ఐపీ టికెట్‌లను తనిఖీ చేసే విజిలెన్స్ సిబ్బంది అరుణ్‌కుమార్ పాండేను అనుమానించి విచారించారు. దీంతో వాస్తవాలు బయటపడ్డాయి. వెంటనే టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్‌కుమార్ పాండేను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో ఆయన సివిల్ అధికారి అని, అయితే ఐపీఎస్ అధికారి అని చెప్పుకొని టికెట్ పొందినట్లు తేలిందన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే సివిల్ అధికారులైనా తమకు ఉన్న హోదాను చెప్పుకొని శ్రీవారి దర్శనం టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుందని, అబద్ధపు ఐడీ కార్డులు సృష్టించుకుంటే అది చట్టపరంగా తీవ్ర నేరమని డీఎస్పీ ప్రభాకర్ రావు అన్నారు. ఈ మేరకు అరుణ్‌పాండేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.