క్రైమ్/లీగల్

ఫ్లాట్‌లో మంటలు అంటుకొని ముగ్గురి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘజియాబాద్, జనవరి 8: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఫ్లాట్‌లో మంటలంటుకొని అందులో నిద్రిస్తున్న ఘజియాబాద్ అభివృద్ధి సంస్థ (జీడీఏ) సూపర్‌వైజర్, అతని భార్య, తమ్ముడు మృతి చెందారు. ఘజియాబాద్‌లోని ప్రతాప్ విహార్‌లో ఈ ఘటన జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు బుధవారం తెలిపారు. రూమ్ హీటర్ వైర్ లోహంతో తయారు చేసిన మంచానికి తగలడం వల్ల మంటలు లేచినట్టు కనపడుతోందని వారు తెలిపారు. మృతులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాండా జిల్లాకు చెందిన బచ్చూ సింగ్ (48), అతని భార్య రాణి (45), వికలాంగుడయిన అతని తమ్ముడు నారాయణ్ (40)లుగా గుర్తించారు. సింగ్‌కు ఇద్దరు కుమారులు- గుల్షన్ (22), ప్రాతం (16), కుమార్తె రాఖీ (17) ఉన్నారు. అయితే, వారు వేరే ఊరికి వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లాట్‌లో లేరు. ‘్ఫ్లట్‌లో ఉన్న మొత్తం ముగ్గురు సజీవదహనమయ్యారు. ఆ గది అంతా బూడిదలా మారిపోయింది’ అని చీఫ్ ఫైర్ ఆఫీసర్ సునిల్ కుమార్ తెలిపారు. ప్రతాప్ విహార్‌లోని సెక్టార్ 11లో గల జీడీఏకు చెందిన పదంతస్థుల భవనంలోని ఒక ఫ్లాట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను కనుగొనడానికి విచారణ జరిపేందుకు నగర మేజిస్ట్రేట్ శివ ప్రకాశ్ శుక్లాను విచారణ అధికారిగా నియమించారు. ‘నాలుగు రోజుల్లోగా మెజిస్టీరియల్ విచారణను పూర్తిచేసి ముఖ్యమంత్రికి నివేదికను అందజేయడం జరుగుతుంది. తరువాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది’ అని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే ఒక వార్తాసంస్థకు చెప్పారు. ‘జీడీఏ ఆ ఫ్లాట్లను ఇంకా ఎవరికీ కేటాయించలేదనే విషయం నా దృష్టికి వచ్చింది. అయినప్పటికీ, సూపర్‌వైజర్ చాలా కాలం నుంచి ఆ ఫ్లాట్‌లో తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు’ అని ఆయన చెప్పారు. విచారణ తరువాత ఈ ఘటనపై చర్య తీసుకోవడం జరుగుతుంది’ అని ఆయన తెలిపారు.