క్రైమ్/లీగల్

బొగ్గు గనుల కేసులో కేంద్రానికి సుప్రీం నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: బొగ్గు గనుల కేటాయింపుదారులకు పరిహారం చెల్లింపునకు సంబంధించిన చట్టంలోని ప్రత్యేక నిబంధనలకు రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) చట్టం చెల్లుబాటును పలువురు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. 2014లో బొగ్గు బ్లాకుల కేటాయించిన వారికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రద్దుచేశారు. వారందరికీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ప్రత్యేక నిబంధనలకు ఏ విధమైన చట్టబద్ధత ఉందంటూ సుప్రీను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎఎస్ బాబ్డే నేతృత్వంలోని న్యాయమూర్తులు బీఆర్ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం కేంద్ర బొగ్గు గనుల శాఖ, న్యాయ మంత్రిత్వశాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్(ఎఫ్‌ఐఎంఐ) బొగ్గు గనుల చట్టం-2015 చట్టబద్ధతపై కోర్టులో సవాల్ చేసింది. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత, హేతుబద్ధతకు సంబంధించి చట్టంలో ఎక్కడా స్పష్టత లేదని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కేటాయింపులు రద్దుయిన పార్టీలకు పరిహారం చెల్లింపునకు సంబంధించి కాలపరిమితి నిర్ణయంపైనా వారు సందేహాలు వ్యక్తం చేశారు. ‘బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధన) చట్టంలో పేర్కొన్న సెక్షన్ 16(1), 16(2) కింద ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. రాజ్యాంగ విరుద్ధమేకాకుండా, ఏకపక్షం, వివక్షపూరితం. న్యాయబద్ధంగా బ్లాక్‌లు దక్కించుకున్న వారికి తీవ్ర నష్టం జరుగుతుంది. వాళ్ల హక్కులను హరించే నిబంధనలే అవి’అని పిటిషనర్లు ఆరోపించారు. న్యాయమూర్తి వీ శ్యాంమోహన్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా మళ్లీ గనుల కేటాయింపు సరైంది కాదని ఎఫ్‌ఐఎంఐ వాదిస్తోంది.