క్రైమ్/లీగల్

కోర్టు హాల్లో శవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 8: సంఘ విద్రోహ శక్తుల చేతిలో మృతి చెందాడన్న ఆగ్రహంతో ఓ లాయర్ మృతదేహంతో అతని సహచరులు ఏకంగా కోర్టు హాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన లక్నో జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో చోటుచేసుకుంది. 32 ఏళ్ల శిశిర్ త్రిపాఠీని అతని ఇంటి సమీపంలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు రాళ్లు, కర్రలు, ఇనుప చువ్వలతో శిశిర్‌పై దాడి చేశారని అతని తోటి లాయర్లు అన్నారు. సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పలు కేసుల్లో వాదిస్తున్నందుకే అతనిని హతమార్చారని ఆరోపిస్తూ శవాన్ని జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు హాల్లోకి తీసుకెళ్లారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దోషులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. దోషులకు శిక్ష తప్పదని హామీ ఇచ్చి, శిశిర్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అతని ఇంటికి పంపించారు.