క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, జనవరి 9: లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఉద్యోగి, అతని అసిస్టెంట్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి రూ.15వేలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. వివరాలలోకి వెళితే.. శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలోని బాపునగర్‌లో ఎజాజ్ ఖాన్ 60 గజాల స్థలంలో మూడు అంతస్తుల భవనం నిర్మించాడు. పదేళ్ల క్రితం పీటీఐ నెంబర్ 1119903859 ప్రకారం ఇంటి నెంబరు 7-32తో ఉన్న ఇంటిని కొనుక్కుని ఇటీవల మరో రెండు అంతస్తులు కట్టుకున్నాడు. వారం క్రితం ఆస్తి పన్ను క్రమబద్ధీకరించడానికి ట్యాక్స్ ఇన్‌స్పెపెక్టర్ డీ.యాదయ్య వెళ్లి ఇంటి యజమానిని లంచం డిమాండ్ చేశాడు. గతంలో ఉన్న రూ.350 పన్ను రూ.15వేలకు పెరుగుతుందని మొత్తం మూడున్నర సంవత్సరాలకు కలిపి రూ.50వేలకుపైగా కట్టాల్సి ఉంటుందని బెదిరించాడు. కేవలం ఈ ఏడాదికి మాత్రమే పన్ను విధిస్తానని, తనకు రూ.15వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఏసీబీని ఇంటి యజమాని ఎండీ ఎజాజ్ ఖాన్ ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం రూ.15వేలు లంచం డబ్బును తీసుకుంటున్న టీఐ యాదయ్య పర్సనల్ అసిస్టెంట్ సాయిని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, అధికారుల బృందం వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్ 20 రెవెన్యూ విభాగానికి తీసుకెళ్ల సోదాలు జరిపి వివరాలు సేకరించారు. 2016లో కుత్బుల్లాపూర్ సర్కిల్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన యాదయ్య తన అసిస్టెంట్ సాయితో కలిసి భారీగా లంచాలు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీతో ఎలాంటి సంబంధం లేకుండా ట్యాక్స్ ఇన్‌స్పెపెక్టర్‌లు, బిల్ కలెక్టర్‌లు తమ స్వంతంగా అసిస్టెంట్‌లను పెట్టుకుని వేలాది రూపాయలు జీతాలు ఇస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అరెస్టు చేసిన ట్యాక్స్ ఇన్స్‌పెక్టర్ యాదయ్య, అసిస్టెంట్ సాయిని కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ చెప్పారు. ఏసీబీ అధికారుల బృందంలో ఇన్‌స్పెక్టర్‌లు బీ.గంగాధర్, బీ.నాగేంద్ర బాబు ఉన్నారు.