క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు సెల్ టవర్‌కు మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 9: రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలిలో సెల్ టవర్‌కు మంటలు వ్యాపించాయి. కింది నుంచి టవర్ పైవరకు ఉన్న కేబుల్స్‌కు మంటలు వ్యాపించి క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. రాయదుర్గం ఎస్‌ఐ మురళీధర్ కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని నాసర్ స్కూల్ నుంచి ఐకియాకు వెళ్లే మార్గంలో ఉన్న ఐడియా, ఎయిర్‌టెల్ సెల్‌ఫోన్ టవర్‌లో ఆరు గంటల సమయంలో మంటలు వ్యాపించాయని అన్నారు. చెట్ల మధ్యలో సెల్‌టవర్ ఉండడంతో మంటలు ఆర్పెందుకు వీలు పడలేదని అన్నారు. చూస్తుండగా క్షణల వ్యవధిలో టవర్‌కు ఉన్న కేబుల్స్ మొత్తం కాలిపోయాని తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో కేబుల్స్‌కు మంటలు వ్యాపించి ఉండవచ్చని రాయదుర్గం ఎస్‌ఐ మురళీధర్ తెలిపారు. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.