క్రైమ్/లీగల్

విల్లాల్లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జనవరి 11: అర్ధరాత్రి సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన సంఘటన దుందిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దుందిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట్ గ్రామంలోని హైరైజ్ గేటెడ్ కమ్యునిటీ కాలనీలోని విల్లా నంబరు- 165/బీలో శ్రీనివాస్ కుటుంబం నివసిస్తారు. రోజూ మాదిరిగానే శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లోని పై అంతస్థులో నిద్రిస్తున్నారు. దుండగులు ఇంట్లోకి చొరబడి గ్రౌండ్ ఫ్లోర్‌లోని బీరువా తాళాలు పగులగొట్టి మూడు తులాల బంగారం, అరకిలో వెండి ఆభరణాలు, రూ.13 వేల నగదును అపహరించారు. శనివారం ఉదయం కిందికి వచ్చిన శ్రీనివాస్ తన గదిలోని బీరువా పగులగొట్టి వస్తువులన్నీ చిందకవందరగా పడి ఉన్నాయి. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్‌తో క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.