క్రైమ్/లీగల్

10 మంది రైతులు బెయిల్‌పై విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 11: రాజధాని ప్రాంతంలో రైతులు చేస్తున్న నిరసనలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన కేసులో అరెస్ట్ అయిన 10 మంది రైతులు శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. తుళ్లూరు సిఐ శ్రీహరిరావు నిందితులను అరెస్ట్ చేసి మంగళగిరి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వివిఎన్‌వి లక్ష్మి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించిన విషయం విదితమే. శుక్రవారం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయమూర్తి కేసులో నిందితులైన కారుమంచి ఫణీంద్ర, కారుమంచి అప్పయ్య, జొన్నలగడ్డ మనోజ్, బొర్రా వరప్రసాద్, భూక్యా లోకనాయక్, నాయుడు వెంకటేశ్వరరావు, త్రిపురనేని శ్రీను, కారుమంచి ఫకీరయ్య, నాయుడు రామకృష్ణ, బోడేపూడి నాగరాజులకు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యారు. విడుదలైన వారికి జిల్లా కేంద్ర కారాగారం వద్ద గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్వాగతం పలికారు.
పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. తీవ్రాదులతో వ్యవహరించినట్లుగా రైతులతో కూడా నడుచుకుంటున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఇలా ఉండగా మాచర్ల ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి కారుపై జరిగిన దాడి కేసులో మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులు జైలులోనే ఉన్నారు. వీరికి ఇప్పటివరకు బెయిల్ పిటిషన్ దాఖలు కాలేదు.