క్రైమ్/లీగల్

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), జనవరి 12: అతని కన్నుపడితే మెడలోని బంగారు వస్తువులు అంతే మాయం.. చాకచక్యంగా ప్రజలను ఏమార్చి రెప్పపాటులో బంగారు ఆభరణాలు తస్కరిస్తాడు.. కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు చూపిస్తున్న అంతరాష్ట్ర దొంగ గుట్టును రట్టుచేశారు గుంటూరు సీసీఎస్ పోలీసులు. ఆదివారం సిసియస్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సీసీఎస్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాఘవ మాట్లాడుతూ గుంటూరు నల్లచెరువుకు చెందిన అంబటి చక్రవర్తి దురలవాట్లకు బానిసగా మారి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఖాళీ ఇళ్లు, అదేవిధంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నాడు. ఇదే క్రమంలో పలు మార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నగలు అపహరిస్తున్నట్లు అతనిపై కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం సంగడిగుంట ప్రాంతంలో ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడని తెలిపారు. అతని వద్ద నుంచి 300 గ్రాముల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుదని ఆయన తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులకు సిఫార్సు చేసినట్లు శ్రీరాఘవ తెలిపారు.