క్రైమ్/లీగల్

హత్య కేసులో నిందితుని అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరి 12: హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చండ్రగూడెం గ్రామానికి చెందిన గాలంకి విజయలక్ష్మి(38)ని అదే గ్రామానికి చెందిన గాలంకి రాజేష్ కొన్ని రోజుల క్రితం గడ్డపలుగుతో పొడిచి చంపేశాడు. ఈసంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా రాజేష్ నిందితుడిగా గుర్తించారు. రాజేష్ విజయలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈనేపధ్యంలో ఇటీవల వీరి మధ్య మనస్పర్థలు రాగా ఆగ్రహించిన రాజేష్ ఆమెను గడ్డపొలుగుతో పొడిచి చంపేశాడు. విచారణలో భాగంగా నిందితుడు రాజేష్‌ను ఆదివారం గొల్లగూడెం సమీపంలో అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పి శ్రీను, ఎస్‌ఐ ఈశ్వరరావు పాల్గొన్నారు.