క్రైమ్/లీగల్

ఓనీ షేర్ల కొనుగోలుపై ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: హైదరాబాద్ ఐఎంఎస్ కుంభకోణంపై దృష్టి సారించిన ఏసీబీ పలు ఆధారాలు సేకరించింది. ఈ కుంభకోణంకు సంబంధించి ఏసీబీ అనేక కేసులు నమోదు చేసింది. ఇప్పటికే మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రూ. 10 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేల్చింది. ఈ కేసుపై పట్టు బిగించిన ఏసీబీ అధికారులు తవ్విన కొద్ది వందల కోట్లు దారి మళ్లినట్లు గుర్తించారు. తాజాగా కిట్ల కోనుగోలులో చోటు చేసుకున్న అవినీతిపై మర రెండు కేసులు నమోదు చేసింది ఏసీబీ. దేవికారాణి ఐటీ రిటర్న్స్‌కు సంబంధించిన వివరాలపై సమాచారాన్ని కోరుతూ ఇటీవల ఐటీ అధికారులకు ఏసీబీ అధికారులు లేఖలు రాశారు. మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మపైనా ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో సమగ్ర విచారణకు వీరిద్దరినీ ఏసీబీ అధికారులు మరోమారు కస్టడీకి తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఒనీ మెడికల్స్ యజమాని శ్రీహరిబాబు అలియాస్ బాబ్జీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాడు. ఈ కోనుగోళ్లకు సంబంధించి ఏసీబీ అధికారులు దర్యాప్తు నిమిత్తం షేర్ కంపెనీలు, సెబీకి లేఖలు రాశారు. ఉమ్మడి రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కుంభకోణం కేసులో అనేక అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.