క్రైమ్/లీగల్

వివాహిత మహిళ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 13: వివాహిత మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం ముకేశ్‌సింగ్, భార్య రీతాదేవి(27)తో కలిసి నివాసం ఉంటూ మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్యూమినీయం కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. రోజు మాదిరిగానే సోమవారం ముకేష్ తన విధులకు వెళ్లి తిరిగి వచ్చి చూసేసరికి భార్య రీతా కనిపించలేదు. ముగ్గురు పిల్లలను ఇంటి వద్దే వదిలేసి అదృశ్యమైంది. చుట్టుపక్కల, తెలిసిన చోట, బంధువుల వద్ద ఆమె ఆచూకీ కోసం ఆరా తీసినా లాభం లేకపోయింది. ఫోన్ చేసినా స్వీచ్ఛ్ఫా వస్తుంది. దీంతో చేసేది లేక ముకేశ్ సింగ్ మంగళవారం రాత్రి మేడ్చల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గండిమైసమ్మ డంపింగ్ యార్డ్‌లో మంటలు
జీడిమెట్ల, ఫిబ్రవరి 13: గండిమైసమ్మలోని మహాత్మా జ్యోతిబా పూలే స్టేడియం సమీపంలోని చెత్త డంపింగ్ యార్డ్‌లో బుధవారం మంటలు ఎగిసిపడ్డాయి. నల్లటి పొగతో ప్రాంతమంతా కమ్ముకుపోవడంతో దుందిగల్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి స్పందించి మంటలకు కారణాలను తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో మంట పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.