క్రైమ్/లీగల్

నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్ల కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: మరణ శిక్షను సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయమూ ర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను ఎలాంటి విచారణ అర్హత లేద ని తేల్చిచెప్పింది. నిర్భయ దోషులు వినయ్ శర్మ(26), ముకేష్ కుమార్(32) క్యురేటీవ్ పిటిష న్లు దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం దాన్ని తోసిపుచ్చు తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. క్యు రేటివ్ పిటిషన్లకు విచారణ అర్హత లేదని బెంచ్ స్పష్టం చేసింది. నిర్భయ సామూహిక అత్యాచారం, హ త్య కేసులో నలుగురు దోషులుగా న్యా యస్థానం మరణశిక్ష విధించింది. మరణశిక్షపై స్టే కోరుతూ దోషులు ఇంతకు ముందు సుప్రీంను ఆశ్రయించిన భంగ పడ్డారు. దీంతో పవన్, ముకేష్ క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. నలుగురు దోషులకు ఈనెల 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మంగళవారం ధర్మాసనం తీర్పుతో న్యాయపరంగా దోషులకు ఉన్న చివరి అవకాశం ముగిసింది. నలుగురు మానవ మృగాలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఇంతకు ముందే తీర్పును వెలువరించింది. తీహార్ జైలులోనే దోషు లు నలుగురికి శిక్ష అమలు చేయాలని బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. క్యురేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలో న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్, ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ చాంబర్‌లో పరిశీలించారు. దోషుల్లో మరో ఇద్దరు అక్షయ్ కుమార్ సింగ్( 31), పవన్ గుప్తా(25) క్యురేటివ్ పిటిషన్లు వేయలేదు. మరణశిక్ష అమలు చేయాలని ఈనెల 7న తీర్పును ఇచ్చిన ఢిల్లీ కోర్టు న్యాయమైన అంశాలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పుడా అవకాశం కూడా ముగియడంతో మరణశిక్ష అమలే మిగిలింది. సుప్రీం కోర్టు తీర్పుతో నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. 22వ తేదీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నామని ఆమె మీడియాతో అన్నారు.
'చిత్రం... నిర్భయ తల్లి విజయ సంకేతం