క్రైమ్/లీగల్

విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్‌లపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపీఎస్, నలుగురు ఐఎఎస్ అధికారులపై సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడటం లేదు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో తప్పుడు నివేదికలు ఇచ్చారనే ఆరోపణలపై విశ్రాంత ఐపీఎస్ అధికారులు దినేష్‌రెడ్డి, కేఎల్‌ఎన్ రాజుతో పాటు విశ్రాంత ఐఎఎస్‌లు ఎస్వీ ప్రసాద్, పీకే మహంతి, రత్నప్రభ, విద్యాసాగర్‌లపై ఈ కేసులు నమోదు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ నాంపల్లి కోర్టును వత్స అనే మహిళ ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు వీరిపై ఐపీసీ 201 సహా సీఆర్‌పీసీ 156(3) సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.