క్రైమ్/లీగల్

దేవికారాణి ఐటీ వివరాలు సేకరించిన ఏసీబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో తవీనకొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 22 మందిని అరెస్టు చేసింది. దేవికారాణి ఆస్తులపై ఏసీబీ కూపీ లాగుతున్న నేపథ్యంలో ఆమె ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నుంచి సమగ్ర వివరాలు కావాలని కోరుతూ ఇటీవల ఏసీబీ లేఖ రాసింది. దీంతో దేవికారాణి ఐటీ రిటర్నులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని గత నెలలో లేఖ రాయడంతో 2014 నుంచి 2019 వరకు ఆమె చెల్లించిన పన్నులకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖ లేఖ ద్వారా ఏసీబీకి అందించింది. ప్రధాన నిందితురాలు దేవికారాణితో పాటు కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఓమ్ని మెడికల్స్ యజమాని శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.99 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన విషయం విదితమే. ఈ కేసులో శ్రీహరి వివరాలు తెలుసుకున్న విధంగానే దేవికారాణి వివరాలనూ సేకరించింది. శ్రీహరి ప్రతి సంవత్సరం రూ.19 కోట్లు పన్ను రూపంలో ఐటీ శాఖకు చెల్లించినట్లు వెల్లడైంది. ఇదే తరహాలో రూ. 100 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టిన దేవిక ఐటీ రీటర్నులను పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించిన నేపథ్యంలో త్వరలో దేవికారాణి, పద్మలను మరోసారి కస్టడీలోకి తీసుకునే ఆవకాశం ఉంది. ఈ క్రమంలో 2014 నుంచి 2019 వరకు వీరు పలు చోట్ల కొనుగోలు చేసిన ఆస్తులు, చెల్లించిన ఆస్తుల రిటర్నులపై పూర్తి వివరాలు సేకరించేందుకు ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.