క్రైమ్/లీగల్

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, జనవరి 14: నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం జరిపాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువులో మంగళవారం ఈ దారుణం జరిగింది. కొత్తచెరువుకు చెందిన బోయ వెంకటేష్(70) స్థానిక మఠంలో నివసిస్తున్నాడు. మంగళవారం అంగడి వద్ద ఆడుకుంటున్న చిన్నారి(4)ని చాక్‌లెట్ ఇస్తానని చెప్పి మఠం లోపలికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. చిన్నారి ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి తాత ఇలా చేశాడని చెప్పడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలిసి స్థానికులు వెంకటేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. బాలికకు తీవ్ర రక్తస్త్రావం కావంతో వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా 2013లో వెంకటేష్ ఇదే స్థలంలో 4 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం జరిపాడు. ఆ కేసును కోర్టు ఇటీవల కొట్టివేసింది.