క్రైమ్/లీగల్

తండ్రి కాదు..దుర్మార్గుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, జనవరి 14: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి లేని కారణంగా బాలిక ఓ హాస్టల్‌లో తొమ్మిదవ తరగతి చదువుకుంటోంది. సంక్రాంతి సెలవులు కావటంతో తన స్వగ్రామం వచ్చింది. ఆదివారం రాత్రి కన్నతండ్రి కూతురని కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తాను కుమిలిపోయింది. అయితే సోమవారం రాత్రి మళ్లీ కూతురిపై అత్యాచారానికి యత్నించగా భయకంపితురాలైన ఆ బాలిక పక్కింటికి పరుగులు తీసింది. విషయం తెలుసుకున్న పక్కింటివారు 100కు ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ ఎం రాజగోపాలరెడ్డి, అనపర్తి సీఐ ఎన్‌వి భాస్కరరావు, రాయవరం ఎస్సై ఎల్ శ్రీనూనాయక్‌లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై ఫోక్సో, దిశ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియవచ్చింది.