క్రైమ్/లీగల్

ఉరి తేదీ మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు మరణశిక్ష అమలుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సరైన నివేదిక అందజేయాలని తీహార్ జైలు అధికారులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సతీష్ కుమార్ అరోరా పలు ఆదేశాలు ఇచ్చారు. ఉరి తేదీని మార్చాలని తీహార్ జైలు అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ దోషులకు ఈనెల 22 ఉదయం 7 గంటలకు ఉరిశిక్షను అమలుచేయాలని ఇంతకు ముందు ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దోషుల్లో ఒకడు ముకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్టప్రతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఇంతకు ముందు పవన్, ముకేష్ దాఖలు
చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. తాజాగా తన క్షమాభిక్ష పిటిషన్ రాష్టప్రతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలని ముకేష్ కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు సంబంధించి వారెంట్లను పక్కన బెట్టాలని ముకేష్ తరపున్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి పిటిషన్‌నే ఢిల్లీ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. కింద కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు పేర్కొంది. ముద్దాయి ముకేష్ సింగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు.