క్రైమ్/లీగల్

తప్ప తాగి తగాదా : హితుడే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, జనవరి 16: స్నేహితుల మధ్య తగాదా హత్యకు దారి తీసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పర్వదినం సందర్భంగా కేపీహెచ్‌బీకాలనీ 3వ ఫేజ్‌లోఆజ్‌బెస్టాస్ కాలనీలో నివాసం ఉంటున్న జోసెఫ్ సుమన్ అనే వ్యక్తి కేపీహెచ్‌బీకాలనీలోని తన స్నేహితుడు ప్రశాంత్, మరి కొందరి స్నేహితులతో కలిసి సుమన్ ఇంటిపై పార్టీ చేసుకున్నారు. పార్టీలో మద్యం సేవించి అర్ధరాత్రి 12 గంటల వరకు వారి వారి ఇళ్లకు వెళ్లిపోగా ప్రశాంత్, జోసెఫ్ సుమాన్ అతిగా మద్యం సేవించడంతో అక్కడే ఉన్నారు. కొద్ది సేపటికి వారిరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో జోసెఫ్ సుమన్‌పై కత్తితో ప్రశాంత్ దాడి చేశారు. దీంతో సుమన్ కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.