క్రైమ్/లీగల్

మహిళా పోలీసుకే బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే, ఫిబ్రవరి 13: థానేలో ఒక మహిళకు కోటి రూపాయలు విలువ చేసే సగం రేటుపై ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఒక ఉదంతం వెలుగు లోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు మోసానికి పాల్పడిన మహిళను అరెస్టు చేశారు. విచిత్రమేమిటంటే ఈ కేసులో మోసపోయిన మహిళ కూడా ఒక జూనియర్ పోలీసు అధికారి కావడం విశేషం. థానే పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఒక మహిళను ముంబాయికి చెందిన దీపాలి అనే మహిళ కలిసి ధనవంతులు నివసించే కాలనీలో రూ.1 కోటి విలువ చేసే ఫ్లాట్‌ను తక్కువ రేటుకే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీనికి రూ.13.81 లక్షలు కమిషన్ ఇవ్వాలని కోరారు. పైగా పోలీసు అధికారి భర్తకు కూడా విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికారు. కమిషన్ తీసుకుని దీపాలి ఉడాయించారు. రోజుల తరబడి కనపడలేదు. అడ్వాన్సుగా తీసుకున్న సొమ్ము గురించి అడిగితే తెలియదని ముఖం చాటేసింది. దీంతో మోసపోయిన మహిళా పోలీసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.