క్రైమ్/లీగల్

వాహనం అదుపుతప్పి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జనవరి 16: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి అవుషాపూర్‌లో గురువారం తెల్లవారుఝామును జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ ప్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో యాదాద్రి జిల్లా అలేరు మండలం షారాజీపేట గ్రామానికి చెందిన కంతి రవితేజ(22) తన ఇద్దరు మిత్రులు దయ్యాల చంద్రశేఖర్, నీరటి వినోద్‌తో కలిసి బుధవారం ఉదయం ఏడు గంటలకు ద్విచక్ర వాహనంపై తమ సొంత పనుల నిమిత్తం హైదారాబాద్ వెళ్లారు. పనులు ముగించుకుని అదే రోజు రాత్రి సొంత గ్రామం షారాజీపేటకు బయలు దేరారు. గురువారం తెల్లవారు జామున 2.10 గంటలకు బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. కంతి రవితేజ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, నీరటి వినోద్, వాహనాన్ని నడుపుతున్న దయ్యాల చంద్రశేఖర్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.