క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జనవరి 16: రాజీవ్ రహదారిపైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సంఘటన అల్వాల్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరయాంజాల్ - హకీంపేట చౌరస్తాలో జరిగింది. అల్వాల్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మచ్చబొల్లారం నివాసులైన జగదీష్, శిరీష్ తూంకుంటలోని బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు జనవరి 14 రాత్రి హాజరై తిరిగి హకీంపేట నుంచి మచ్చబొల్లారంలోని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. దేవరయాంజాల్ వద్ద ఎదురుగా వచ్చిన జగిత్యాలకు చెందిన పూజిత ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకోనడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.