క్రైమ్/లీగల్

ఎరిక్సన్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్(ఆర్‌కామ్) చైర్మ న్ అనిల్ అంబానీ, మరో ఇద్దరిపై ఎరిక్సన్ ఇండియా దాఖలు చేసిన కోర్టు ధిక్కారణ కేసులో సుప్రీంలో విచారణ పూర్తయింది. బుధవారం విచారణ పూర్తిచేసిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. 550 కోట్ల రూపాయలు చెక్కు నాన్‌క్లియరెన్స్‌కు సంబంధించి ఎరిక్సన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఎరిక్సన్ ఇండియా తరఫున సీనియర్ అడ్వొకేట్ దుశ్యంత్ దావే వాదించారు. కోర్టు ఆదేశాలను ఆర్‌కామ్ ఉద్దేశపూర్వకంగా అమలుచేయలేదని, దాంతోపాటు ఇద్దరిపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని దావే కోరారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను తమ క్లయింట్ ఎక్కడా ఉల్లంఘించలేదని ఆర్‌కామ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రొహత్గీ వాదించారు. అంబానీ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ చైర్మన్ సతీష్ సేథ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్ చైర్‌పర్సన్ ఛాయా వీరాణీ కోర్టుకు హాజరయ్యారు. వాదనలు జరుగుతున్నప్పుడు వారిద్దరూ కోర్టు హాలులోనే ఉన్నారు. ఎరిక్సన్‌కు ఇవ్వాల్సిన బకాయిలు 2018 డిసెంబర్ 15 నాటికి చెల్లించాలని ఆర్‌కామ్‌ను సుప్రీం కోర్టు గత ఏడాది ఆదేశించింది. చెల్లింపుల్లో జాప్యం జరిగితే 12 శాతం వడ్డీతో ఇవ్వాలని బెంచ్ పేర్కొంది.