క్రైమ్/లీగల్

ప్రైవేట్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తమ ఇష్టానుసారంగా రేట్లు పెంచి వేయటమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా స్వైర విహారం చేస్తుండటంపై రవాణా శాఖ కనె్నర్ర చేసింది. ఇష్టానుసారం రేట్లు పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోబోం...దాడులు చేస్తామంటూ సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ముందుగా పలుమార్లు హెచ్చరికలు చేసినా ఫలితం లేకపోవడంతో తొలుత రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మొవ్వా తిరుమలకృష్ణబాబు, రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాదరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముందు ప్రారంభమైన దాడులు శనివారం కూడా జరిగాయి. కృష్ణా జిల్లాలో శనివారం జిల్లా రవాణాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో అధికారులు 23 బస్సులను సీజ్ చేశారు. వీటిల్లో కీసర టోల్ ప్లాజా, గరికపాడు చెక్‌పోస్టు వద్ద 14, కనకదుర్గమ్మ వారథి వద్ద 2, పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద 3, పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 4 బస్సులున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒక్క కృష్ణాలోనే 225 బస్సులను సీజ్ చేసామని వెంకటేశ్వరరావు తెలిపారు. నిబంధనల ప్రకారమే బస్సులను నడపాలని, ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 546 బస్సులను సీజ్ చేసి 3172 కేసులు నమోదు చేసినట్లు మంత్రి పేర్ని తెలిపారు. తనకు వాట్సాప్ ద్వారా చాలా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఆర్టీసీ ద్వారా 3.20 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే తనకు ఫిర్యాదు చేయాలని మంత్రి పేర్ని నాని తన వాట్సాప్ నెంబర్‌ను ప్రజలకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఓ ప్రయాణికుడు, కడప జిల్లా పొద్దుటూరు నుండి మరో ప్రయాణికుడు వాట్సాప్ ద్వారా సమాచారం నేరుగా మంత్రి పేర్నికి శనివారం ఉదయం పంపారు. కనిగిరి నుండి హైదరాబాద్‌కు సాధారణంగా రూ.500లు టికెట్ ఛార్జ్ చేస్తారని, ప్రస్తుతం రూ.1500లు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే కడప నుండి హైదరాబాద్‌కు సాధారణ టికెట్ ధరల కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి తక్షణమే స్పందించి ప్రకాశం, కడప డీటీసీలతో మాట్లాడి ఆ బస్సులను సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎవరి ఒత్తిడికి గురి కాకుండా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా కృష్ణాజిల్లాలో 202 బస్సులను సీజ్ చేసినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.