క్రైమ్/లీగల్

ఉపాధ్యాయులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 13: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల 1లో ఎనిమిదవ తరగతి చదువుతున్న కొర్ర మోహన్‌రావు(13) అనే విద్యార్థి బుధవారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఉపాధ్యాయులు అందించిన సమాచారం ప్రకారం మోహన్‌రావుతరుచూ తరగతులకు గైర్హాజరు అవుతుంటాడని, ఎప్పటిలాగే స్కూల్‌నుంచి రెండు రోజుల క్రితం వెళ్లిన మోహన్‌రావుతిరిగి మంగళవారం పాఠశాలకు వచ్చాడన్నారు. దీంతో మోహన్‌రావును పాఠశాల ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపం చెందిన మోహన్‌రావు బుధవారం బోజనాల సమయంలో హస్టల్ గదిలో ఉరిపోసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఇదిలాఉండగా తన కుమారుడు చదువులో ముందుంటాడని, మంగళవారం తన స్నేహితులతో కలిసి స్వగ్రామమైన దోడిపుట్టుకు వచ్చి తన ఆధార్ కార్డు తీసుకుని బుధవారం పాఠశాలకు వెళ్లాడని మృతుని తండ్రి కొర్ర రామారావు తెలిపారు. తన కుమారుడి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. తన కొడుకు మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతితో ఆగ్రహం చెందిన జోడిపుట్టు గ్రామానికి చెందిన గిరిజనులు పాఠశాల ఉపాధ్యాయడు జిన్నుపై బుధవారం రాత్రి భౌతిక దాడికి పాల్పటినట్టు తెలిసింది. ఈ ఘటపై మృతుని తండ్రి ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ అరుణ్ కిరణ్ తెలిపారు.