క్రైమ్/లీగల్

హైకోర్టు సీజే ఎదుట ప్రొ. కాశీం హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విరసం కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింది కాశీంను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఎదుట పోలీసులు ఆదివారం హాజరుపరిచారు. ఆదివారం సెలవు దినం కావడంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7లోని తన నివాసంలోనే ప్రధాన న్యాయమూర్తి విచారించారు. శనివారం విరసం కార్యదర్శి కాశీంను పోలీసులు అదుపులోకి తీసుకోవటం అప్రజాస్వామికమంటూ పౌరహక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు కాశీంను తన ఎదుట హాజరు పర్చాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్ హాజరై తమ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కాశీం అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో గురువారానికల్లా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఆదేశించారు.
తిరిగి ఈ విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు. విచారణ ముగిశాక జ్యుడీషియల్ కస్టడి కోసం కాశీంను చర్లపల్లి జైలుకు తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఇలా ఉండగా విచారణ సందర్భంగా కాశీం భార్య స్నేహాలతను కూడా న్యాయమూర్తి అనుమతించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన పలు వామపక్ష, కుల సంఘాలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు కాశీం అరెస్టును నిరసిస్తూ న్యాయమూర్తి ఇంటికెళ్లే దారిలో ఆందోళనకు దిగగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం పిటిషనర్ తరఫు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ, కాశీంను అరెస్టుపై తాము దాఖలు చేసిన హెబియాస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరిచినట్టు వివరించారు. 2016లో నమోదైన కేసులో ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదని పోలీసులను హైకోర్టు ప్రశ్నించినట్టు తెలిపారు.
ఈ మధ్య కాలంలో పోలీసులు ప్రజా సంఘాల నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తోన్న విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు.
'చిత్రం... బంజారాహిల్స్ రోడ్డులోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
నివాసంలో ప్రొ. కాశీంను ఆదివారం హాజరుపరిచిన సందర్భంగా పోలీస్ బందోబస్తు