క్రైమ్/లీగల్

లొంగిపోయిన అనుమానితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 22: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు పదార్థాలు అమర్చిన కేసులో అనుమానితుడిగా ఉన్న 36 ఏళ్ల వ్యక్తి బుధవారం నాడిక్కడ పోలీసుల ముందు లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. బెంగళూరులోని పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన అనుమానితుడిని విచారణ, వైద్య పరీక్షల నిమిత్తం నిర్బంధంలోకి తీసుకున్నట్టు వారు వివరించారు. అనుమానితుడిని మణిపాల్‌కు చెందిన ఆదిత్యరావుగా గుర్తించినట్టు వారు చెప్పారు.
లొంగిపోయిన ఆదిత్యరావు మంగళూరు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన వ్యక్తిని పోలి ఉన్నాడని వారు తెలిపారు. మంగళూరు విమానాశ్రయంలో బాంబు అమర్చినట్టు అనుమానితుడు అంగీకరించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, అనుమానితుడిని ప్రశ్నించడానికి మంగళూరు నుంచి ఒక అధికారుల బృందం బెంగళూరుకు వచ్చింది. ఈ విచారణ బృందం అనుమానితుడిని ప్రశ్నిస్తుందని, తదుపరి న్యాయపరమయిన చర్యలు తీసుకుంటుందని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్ హర్ష సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ఆదిత్య రావును విచారించడం కోసం బెంగళూరులోని హల్సూర్ గేట్ పోలీసు స్టేషన్‌కు తీసికెళ్లినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆదిత్యరావు తరువాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు ఆ వర్గాలు చెప్పాయి. ఆదిత్యరావు 2018లో బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు బెదిరించాడని, ఆ కేసులో ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవించి బయటికి వచ్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదిత్యరావు బెంగళూరు విమానాశ్రయంలో సెక్యూరిటి గార్డ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా, నిర్దిష్టమయిన పత్రాలు లేనందు వల్ల అతనికి ఉద్యోగం ఇవ్వలేదని, దీనికి ప్రతీకారంగానే అతను మంగళూరు విమానాశ్రయంలో బాంబు అమర్చాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆదిత్యరావు 2012లో ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చి ఒక ప్రైవేటు బ్యాంకులో చేరాడు. తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తరువాత అతను మంగళూరుకు తిరిగి వెళ్లి, అక్కడ ఆరు నెలల పాటు సెక్యూరిటి గార్డుగా పనిచేశాడు. తరువాత అతను ఉడుపిలోని పుతిగె మఠ్‌లో వంటమనిషిగా పనిచేశాడు. తరువాత అతను తిరిగి బెంగళూరుకు వచ్చి, ఒక బీమా కంపెనీలో చేరాడు. కొద్ది రోజుల తరువాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, బెంగళూరు విమానాశ్రయంలో సెక్యూరిటి గార్డు ఉద్యోగం కోసం ప్రయత్నించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.