క్రైమ్/లీగల్

ప్రత్యేక ఉద్యమానికి అడ్డొచ్చిన ఏడుగురిని నరికి చంపిన కిరాతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ (జార్ఖండ్): జార్ఖండ్‌లో పతల్‌గర్హి ఉద్యమం తీవ్రతరమయ్యింది. తమ ఉద్యమాన్ని వ్యితిరేకిస్తున్నారన్న కక్షతో పశ్చిమ సింఘూ్భం జిల్లాలోని ఏడుగురు రైతులను సాయుధులైన ఉద్యమకారులు అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఉద్యమకారుల చేతుల్లో లాఠీలు, గొడ్డళ్ళు ఉన్నట్లు స్థానికులు తెలిపారని పోలీసులు చెప్పారు. బురుగులికేర గ్రామం నుంచి ఏడుగురు రైతులను ఉద్యమకారులు కిడ్నాప్ చేశారన్న సమాచారం రావడంతోనే పోలీసులు మంగళవారం రాత్రి హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్నారని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఆపరేషన్) సాకేత్ కుమార్ సింగ్ బుధవారం తెలిపారు. ఉద్యమకారులు హత్య చేసిన ఏడుగురు గ్రామస్థుల భౌతికకాయాలను గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలోని అడవిలో వదిలి పారిపోయారని ఆయన చెప్పారు. సామూహికంగా హత్యకు గురైన వారిలో పంచాయతీరాజ్ ప్రతినిధి కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాఉండగా రాంచీకి 175 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో పతల్‌గర్హి ఉద్యమకారులు మంగళవారం సమావేశం నిర్వహించగా వివాదం చోటు చేసుకున్నదని పశ్చిమ సింఘూ్భం పోలీసు సూపరింటెండెంట్ ఇంద్రజిత్ మహత అన్నారు. దీంతో కక్ష పెంచుకున్న ఉద్యమకారులు తమ ఉద్యమాన్ని వ్యతిరేకించిన ఏడుగురిని అపహరించి తీసుకుని వెళ్ళి హత్య చేశారని ఆయన చెప్పారు. పతల్‌గర్హి అనే పేరును గిరిజనుడు పెట్టాడు. గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని, గిరిజనుల అధీనంలో ఉన్న భూములపై ప్రభుత్వ అజమాయిషీ ఉండరాదని, అడవులు, నదులపై ప్రభుత్వ నిబంధనలు ఉండరాదని తదితర డిమాండ్లతో ఉద్యమం కొనసాగుతున్నది.
సీఎం దిగ్భ్రాంతి
ఏడుగురు గ్రామస్థులను హత్యమార్చిన ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ దిగ్భ్రాంతి చెందారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోలేరని అన్నారు. చట్టం అత్యున్నతమైందని ఆయన తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని, దోషులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి సొరెన్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.