క్రైమ్/లీగల్

చర్యలు మరీ కఠినంగా ఉండొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తప్పు చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవల్సిందేనని, అయితే మరీ కఠిన చర్యలు భావ్యం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్ పేర్కొన్నారు. వరంగల్ ఎన్‌ఐటీలో మొదటి సంవత్సరం విద్యార్థి ఒకర్ని గంజాయి తాగుతున్నాడనే ఆరోపణలతో సస్పెండ్ చేయగా, న్యాయం కోరుతూ ఆ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ సెనేట్ నిర్ణయం తీసుకునే వరకూ చర్యలు ఎందుకు తీసుకోవల్సి వచ్చిందో చెప్పాలని పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. వరంగల్ నిట్‌లో మరికొంత మంది విద్యార్థులు కూడా గంజాయి వినియోగించారని పేర్కొన్నారు.
వీధి కుక్కల స్వైరవిహారంపై మానవ హక్కుల కమిషన్‌లో వ్యాజ్యం
వీధి కుక్కల స్వైరవిహారంపై మానవ హక్కుల కమిషన్‌లో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు వ్యాజ్యం దాఖలు చేశారు. వీధి కుక్కల స్వైరవిహారంతో 50 మంది విద్యార్థులను అమీర్‌పేటలో గాయపరిచాయని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ , పశు సంవర్ధక శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. చలికాలంలో కుక్కలకు కావల్సిన టీకాలు ఇవ్వకపోవడం వల్ల కుక్కలు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్ పేర్కొన్నారు.